Holidays : సెప్టెంబర్ నెలలో ఎన్ని సెలవులో తెలుసా?


Published Aug 30, 2024 04:02:02 PM
postImages/2024-08-30/1725013922_Holidaysinseptember.jpg

న్యూస్ లైన్ డెస్క్ : ఈ ఏడాది సెప్టెంబర్ నెల బడి పిల్లలకు బోలెడన్ని సెలవులు మోసుకొచ్చింది. 30 రోజుల్లో ఏకంగా 9 రోజజులు బడులకు సెలవులు రానున్నాయి. ఇక బ్యాంకులైతే ఏకంగా 16 రోజులు బంద్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సెప్టెంబర్ నెలలో మొత్తం ఐదు రోజులు పండుగ సెలవులు ఉండనున్నాయి. సెప్టెంబర్ 5న టీచర్స్ డే, 7న వినాయక చవితి, 16న మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. అయితే.. 7న వినాయకచవితి, 8 తారీఖు నాడు ఆదివారం వచ్చింది. దీంతో వరుసగా రెండు రోజులు.. సెప్టెంబర్ 14న రెండవ శనివారం, 15న ఆదివారం, 16న మిలాద్ ఉన్ నబీ, 17న వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవులు ప్రకటించనున్నారు. దీంతో వరుసగా నాలుగు రోజులు బడులకు సెలువులు రానున్నాయి.

పిల్లల బడి సంగతి ఇలా ఉంటే.. బ్యాంకులైతే ఏకంగా 14 రోజులు బంద్ కానున్నాయి. ఈ నెలలో కేవలం 16 రోజులు మాత్రమే బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయి. పలు పండుగలు, ప్రత్యేక దినాలు, ఇతర కార్యక్రమాల కారణంగా సెప్టెంబర్ నెల ఈసారి సెలవులు మోసుకొచ్చింది.

newsline-whatsapp-channel
Tags : private-schools government-schools latest-news news-updates telugu-news bank-book

Related Articles