Cm Revanth: రేవంత్ ఇంటి ముందు బ్యాగ్ క‌ల‌క‌లం

జూబ్లీహిల్స్‌లోని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇంటి స‌మీపంలో బ్యాగ్ క‌ల‌క‌లం రేపుతుంది.


Published Sep 15, 2024 04:09:39 PM
postImages/2024-09-15/1726396779_revanth.PNG

న్యూస్ లైన్ డెస్క్: జూబ్లీహిల్స్‌లోని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇంటి స‌మీపంలో బ్యాగ్ క‌ల‌క‌లం రేపుతుంది. కాగా, వెంటనే అప్ర‌మ‌త్త‌మైన చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అనుమానాస్ప‌ద బ్యాగ్‌ను అధికారులు త‌నిఖీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఆ ప‌రిస‌ర ప్రాంతాల‌ను పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆసలు ఆ బ్యాగ్‌లో ఏం ఉందని ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.  

newsline-whatsapp-channel
Tags : telangana police cm-revanth-reddy congress-government house

Related Articles