Thaman: ఉప్పల్ స్టేడియంలో మ్యూజిక్ కాన్సర్ట్ !

మ్యూజిక్ డైరక్టర్ తమన్ తన మ్యూజిక్ కాన్సర్ట్ తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు.


Published Mar 25, 2025 03:00:00 PM
postImages/2025-03-25/1742895117_ThamanspecialperfomancebeforeSRHvsLSGmatchonuppalstadiumon27thmarch1024x576.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :  తెలుగు ఇండస్ట్రీ లో తమన్ పరిచయం అక్కర్లేదు. ఉప్పల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వెల్లే ప్రేక్షకులకు గుడ్ న్యూస్ . మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో మ్యూజికల్ ఈవెంట్ ఉండనుంది. మ్యూజిక్ డైరక్టర్ తమన్ తన మ్యూజిక్ కాన్సర్ట్ తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు.


ఐపీఎల్ అధికారిక హ్యాండిల్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సారి దేశవ్యాప్తంగా ఐపీఎల్ జరుగుతున్న చాలా స్టేడియమ్స్ లో మ్యాచ్ కు ఇదే టైప్ లో మ్యూజిక్ ఈవెంట్స్ ను బీసీసీఐ నిర్వహిస్తుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 18 వ సీజన్ ను గ్రాండ్ విక్టరీతో ఎస్ ఆర్ హెచ్ శుభారంభం చేసింది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu cricket-news music-director

Related Articles