PARLIAMENT: పార్లమెంట్ లో " ఛావా" మూవీ ప్రదర్శన !

బాలయోగి ఆడిటోరియంలో గురువారం ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ వేస్తున్నారు.


Published Mar 25, 2025 02:02:00 PM
postImages/2025-03-25/1742891639_modichhaava.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ ఛావా ను పార్లమెంట్ లో ప్రదర్శించారు. విక్కీ కౌశల్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా " ఛావా" ఫిబ్రవరి 14 న రిలీజైన విడుదలైంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ డూపర్ హిట్ . 


మరాఠా యోధుడు  శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'ఛావా'ను పార్లమెంట్​లో ప్రదర్శించారు. బాలయోగి ఆడిటోరియంలో గురువారం ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ వేస్తున్నారు. ఈ మూవీ చూడడానికి ప్రధాని మోదీ తో పాటు కేంద్రమంత్రులంతా సమావేశమవుతున్నారు.అలాగే విక్కీ కౌశల్‌ సహా చిత్ర బృందం కూడా ఈ కార్యక్రమానికి వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మూవీ టీం కాని సెంట్రల్ నుంచి కాని ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ లేదు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ 'ఛావా' చిత్రంపై ప్రశంసలు కురిపించారు. శివాజీ సావంత్ మరాఠీ నవల వల్లే ఈ శంభాజీ మహరాజ్ వీరత్వాన్ని ఈ మూవీలో చూడడం సాధ్యమైందని తెలిపారు. ఛావా సినిమా ఇప్పటికే వసూళ్లలో రూ.500 కోట్ల మార్కును దాటేసింది. బీటౌన్​లో అనేక రికార్డులను సృష్టించిన ఈ మూవీ తెలుగు వెర్షన్ ఇటీవలే రిలీజైంది. ఇక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విక్కీ కౌశల్ కెరీర్​లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా 'ఛావా' నిలిచింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu parliament vicky-kaushal rashmika-mandanna

Related Articles