ఈ ప్రమాదంలో కారు బాగా డ్యామేజ్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బాలీవుడ్ నటుడు , నిర్మాత సోనూసూద్ భార్య సోనాలికి కారు ప్రమాదం జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో ఆమెకు తీవ్ర గాయాలై హాస్పటిల్ లో ఉన్నారు. సోనాలి తన మేనల్లుడుతో కలిసి నాగ్ పూర్ కు వెళ్లారు. అక్కడ వీరిద్దరు మరో మహిళతో కారులో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనతో కారులో ఉన్న ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్ అలర్ట్ అవ్వడంతో ప్రాణాపాయస్థితి కాకపోయినా దెబ్బలు బాగా తగిలినట్లు బాలీవుడ్ కథనాలు వెలువడుతున్నాయి.
సోనూసూద్ తన సతీమణి కండిషన్ సురక్షితంగానే ఉందని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు . ఈ ప్రమాదంలో కారు బాగా డ్యామేజ్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సోనూసూద్ అభిమానులు తన భార్యకోసం ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. కోవిడ్ టైంలో సోనూసూద్ కొన్ని లక్షల మందికి సాయం చేశారు. ఈ అభిమానమే సోనూసూద్ కు జనాల్లో మరింత ఫేమ్ ను తెచ్చింది.