ఆస్తమా, సిఓపిడి, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి మొదలైన శ్వాసకోశ సంబంధించిన వ్యాధులను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: చిన్న పిల్లలకు ఇమ్యూనిటీ చాలా వీక్ ఉంటుంది. చాలా ఫాస్ట్ గా జలుబు , దగ్గు , జ్వరం ఇలా వస్తుంటాయి. అలా అని మీకు నచ్చినట్లు నెబ్యులైజర్లు వాడుతుంటారు. నిజానికి పిల్లలకు నెబ్యులైజర్ పెట్టడం వల్ల సమస్య మరింత పెద్దదవుతుంది కాని పోదు. ఆస్తమా ..బ్రీతింగ్ ఇష్యూ స్ ఉన్న పిల్లలకు నెబ్యులైజర్ చాలా అవసరం ..ఇవేం లేకుండా పిల్లలకు నెబ్యులైజర్ పెట్టడం అంత మంచిది కాదు.
ఆస్తమా, సిఓపిడి, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి మొదలైన శ్వాసకోశ సంబంధించిన వ్యాధులను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తులలో ఉండేటువంటి స్రావాలు, స్లేష్మం వంటివి తగ్గుతాయి. డాక్టర్ సజిషన్ లేకుండా వాడడం వల్ల పిల్లల లంగ్స్ పై తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
నెబ్యులైజర్ లో ఉపయోగించే మందులు లో స్టెరాయిడ్స్ ఉంటాయి. వాటి వలన ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి.
సరైన జాగ్రత్తలు తీసుకోకుండా దీనిని ఉపయోగిస్తే మరింత ప్రమాదం అనే చెప్పవచ్చు. అంతేకాదు లంగ్స్ కి స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల అప్పటికి ఇబ్బంది తగ్గినా ..తర్వాత తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
ఎప్పుడైతే నెబ్యులైజర్ పైపులో నీటి కారణంగా తేమ ఉంటుందో దానిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీంతో పిల్లల నోటి దగ్గర పెట్టినప్పుడు బ్యాక్టీరియా అనేది చాతిలోకి చేరుతుంది. ఈ విధంగా మరిన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి పిల్లలకు కేవలం జలుబు, దగ్గుకు మాత్రం నెబులైజర్ పెట్టకండి. మీకు ఆవిరి పట్టించడం వల్ల కూడా క్యూర్ అవుతుంది.