hydrabad: మెడికల్ ఎర్రర్ కారణంగా వ్యక్తి మృతి ..డాక్టర్ వల్లే అంటున్న బంధువులు !

అతను డాక్టర్ కాదని అతని వల్లే వ్యక్తి చనిపోయినట్లు బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Published Mar 17, 2025 04:21:00 PM
postImages/2025-03-17/1742208733_057a45e546204fd693e77a83aeeb19e9.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్‌లో ఉన్న సాయి తేజ హాస్పిటల్‌లో చెక్క మహేందర్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే యువకుడు చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. mbbs డాక్టర్ అని చెప్పుకుంటున్నాడు కాని ఎంఆర్ పీ సూచన చేస్తే వైద్యం చేస్తున్నాడని అతను డాక్టర్ కాదని అతని వల్లే వ్యక్తి చనిపోయినట్లు బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పోచంపల్లి మండలంలోని మెహర్ నగర్‌కు చెందిన చెక్క వీరయ్య, విజయల తనయుడు 26 ఏళ్ల మహేందర్ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం తీవ్రమైన కడుపునొప్పితో సరూర్ నగర్ సాయి తేజ హాస్పిటల్‌లో చేరాడు. ఓ ఆర్ ఎంపీ డాక్టర్ సూచనతో ఈ డాక్టర్ దగ్గరకు వచ్చినట్లు తెలిపారు.


అయితే డాక్టర్ దగ్గరకు రాగానే గ్యాస్ ట్రబుల్ చికిత్స స్టార్ట్ చేశారని ..డాక్టర్ ఇంజక్షన్స్ అవి ఇచ్చి వెళ్లిపోయారని అయితే కడుపునొప్పి తగ్గకపోవడంతో మహేందర్ మృతి చెందాడని చెబుతున్నారు. డాక్టర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. కేస్ షీట్ కూడా చూపించడం లేదని పోస్ట్ మార్టం చేస్తే అన్ని తెలుస్తాయంటున్నారని వాపోయారు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు అటెండర్ కాల్ చేస్తూనే ఉన్నాడని, అయినా డాక్టర్ స్పందించలేదని చెప్పారు. తమ పరిస్థితి ఇంకొకరికి రాకూడదనేదే తమ ఆవేదన అని, ఇలా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu doctors died treatment

Related Articles