Fraud: అధిక లాభాల ఆశ చూపి.. కోటి రూపాయలతో పరార్

ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను ఐదు నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించి, రెండు నెలల పాటు లాభాలను చెల్లించాడు.


Published Jun 23, 2024 05:30:58 PM
postImages/2024-06-23/1719144058_fraud.jpg

న్యూస్ లైన్ డెస్క్: అధిక లాభాల ఆశ చూపి గోల్డ్ ట్రెడింగ్‌లో భారీ మోసం జరిగింది. హైదరాబాద్ హబ్సిగూడాలో ప్రణేశ్వరి ట్రేడర్స్ ఎండీ ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఒక్కొక్కరి నుండి 5 లక్షల చొప్పున 500 మంది నుండి కోటి రూపాయల వరకు రాజేష్ వసూలు చేశాడు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను ఐదు నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించి, రెండు నెలల పాటు లాభాలను చెల్లించాడు. అయితే తనపై నమ్మకం కలగడంతో పెద్ద మొత్తంలో బాధితులు ఇన్వెస్ట్మెంట్ చేశారు. కాగా, ఇన్వెస్ట్మెంట్ డబ్బులతో రాజేష్ ఉడాయించాడు. దాంతో బాధితులు సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. తాము మోసం పోయామని తమకు న్యాయం చేయాలని నిరసన తెలిపారు. అయితే గత రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేష్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు వెంటనే రాజేష్ దగ్గర చేసిన ఇన్వెస్ట్మెంట్ డబ్బులను ఇప్పించాలని కోరారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news

Related Articles