ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఛాతీపై దాని చిహ్నాన్ని ధరించారని వెల్లడించారు. యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు అభిమన్యు చేశారని ఆయన ఎద్దేవా చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యల చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాట్లాడిన ఆయన.. కురుక్షేత్రంతో పోల్చారు. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో అభిమన్యుడిని ఆరుగురు వ్యక్తులు చక్రవ్యూహంలో బంధించి చంపారు.. కొద్దిగా రీసెర్చ్ చేసి చక్రవ్యూహాన్ని పద్మవ్యూహం అని కూడా అంటారని తెలుసుకున్నట్లు రాహుల్ తెలిపారు. అంటే 'కమలం ఏర్పడటం' అని అన్నారు. చక్రవ్యూహం కమలం ఆకారంలో ఉంటుందని అన్నారు. 21వ శతాబ్దంలో కొత్త చక్రవ్యూహం ఏర్పడిందని.. అది కూడా కమలం రూపంలో ఉందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఛాతీపై దాని చిహ్నాన్ని ధరించారని వెల్లడించారు. యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు అభిమన్యు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. నేడు కూడా చక్రవ్యూహం సెంటర్‌లో ఆరుగురే ఉన్నారని.. నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ ఈ చక్రవ్యూహాన్ని నడిపిస్తున్నారని ఆయన అన్నారు.
అయితే, పార్లమెంట్ సమావేశంలో రాహుల్ గాంధీ ఇద్దరు వ్యాపారవేత్తల పేర్లు తీసుకొని రావడంపై స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, విపక్ష ఎంపీల వాదనలతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. రాహుల్‌కు సభానియమాలు తెలియవని విమర్శించారు.