Rains: వాతావరణ శాఖ కీలక సూచన.. ఆ జిల్లాలకు అలర్ట్

శనివారం వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


Published Aug 16, 2024 03:44:20 PM
postImages/2024-08-16/1723803260_rains.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిస్తోంది. 

అదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భశ్రీ నుంచి అతి భారీ వర్షాలుపడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

శనివారం వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

newsline-whatsapp-channel
Tags : telangana news-line newslinetelugu telanganam rains weather-update weather-forecast

Related Articles