Revanth Family : బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్న రేవంత్ ఫ్యామిలీ..? 

సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ బ్లాక్ మనీని వైట్ మనీగా చేస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతిరెడ్డి, జగదీష్ రెడ్డి


Published Aug 07, 2024 05:17:54 PM
postImages/2024-08-07/1723031274_RevanthReddySevenBrothers.jpg

న్యూస్ లైన్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ బ్లాక్ మనీని వైట్ మనీగా చేస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతిరెడ్డి, జగదీష్ రెడ్డి, కృష్ణారెడ్డి వ్యవహారాలే దీనికి సాక్షంగా నిలుస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం రేవంత్ బ్రదర్స్ కొత్తగా కంపెనీలు పెట్టడం, ఆ కంపెనీలే రాష్ట్ర పెట్టబడులు పెట్టే కంపెనీలుగా రావడం, ఆ కంపెనీలకే ఇక్కడ చేపట్టబోయే పనుల కాంట్రాక్టర్లు అప్పగించే ప్రయత్నాలు చేయడం చూస్తే ఇదే అనుమానం కలుగుతోంది.

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో స్వచ్ఛ్ బయోతో రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ కంపెనీ రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డిది. ఆ కంపెనీ కూడా కేవలం 15 రోజుల క్రితమే ఏర్పాటు చేశారు. అప్పుడే రూ.వెయ్యి కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో అర్బన్ ఇన్ ఫ్రా అనే ఓ కొత్త కంపెనీని ఏర్పాటు చేశారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి పార్ట్‌నర్‌గా ఉన్నారు.

అనుముల కృష్ణారెడ్డి కూడా సడెన్ గా చాలా కంపెనీల్లో పార్ట్‌నర్ అయారు. అర్బన్ ఇన్ ఫ్రా, ఆర్ నైన్ ప్రాపర్టీస్, ఆర్ నైన్ కన్ స్ట్రక్షన్స్ వీటన్నింటిలో అనుముల  కృష్ణారెడ్డి పార్ట్ నర్ అయ్యాడు. అర్బన్ ఇన్ ఫ్రా కంపెనీ మే 30వ తేదీ నాడు ప్రారంభించారు. ఆర్ నైన్ ప్రాపర్టీస్ కంపెనీ ఏప్రిల్ 29 నాడు ప్రారంభించారు. ఆర్ 9 కన్ స్ట్రక్షన్స్ ఏప్రిల్ 5వ తేదీనాడు ప్రారంభమైంది. ఆర్ నైన్ ప్రాపర్టీస్ మార్చి 20 నాడు ప్రారంభమైంది. ఇలా ఇన్ని కంపెనీలు కేవలం కొద్దిరోజుల్లోనే ప్రారంభించడం, వీటన్నింటిలో రేవంత్ ఫ్యామిలీ భాగస్వామ్యం కావడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. 

సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కొండల్ రెడ్డి,తిరుపతిరెడ్డి ఇప్పటికే అనేక కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అంతేకాదు ఒకానొక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఓ మాట అన్నారు. రుణమాఫీ విషయంలో ‘‘ఒక ఏడాది నోరు కట్టుకుంటే రూ.30వేల కోట్లను ఎడమ చేతితో ఇవ్వొచ్చని‘‘ అన్నారు. ఇలా ఓ వైపు టాక్స్‌ల పేరుతో దందాలు, మరోవైపు సీఎం ఇలా మాట్లాడడంతో వేలా కోట్ల రూపాయల అక్రమంగా సంపాదించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలా వచ్చిన బ్లాక్ మనీనే భూ దందాలు, ఇలా బోగస్ కంపెనీల పేరుతో వైట్ మనీగా మారుస్తున్నారని ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy newslinetelugu telanganam -real-estate cm-revanth-reddy revanth latest-news

Related Articles