Telangana: కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం తెలంగాణలోని తొలి కేసు ఛార్మినార్ లోనే

కొత్త క్రిమినల్ చట్టాల( criinal law)  ప్రకారం తెలంగాణలో( telangana)  తొలి కేసు నమోదయ్యింది. ఆదివారం రాత్రి నుంచి యావత్తు భారత్ లో ఈ కొత్త నేర , న్యాయ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఈ కొత్త చట్టం కింద మధ్యప్రదేశ్( mp)  లో అర్ధరాత్రి 12-20 గంటలకు ఫస్ట్ కేసు నమోదయ్యింది.


Published Jul 01, 2024 06:44:00 PM
postImages/2024-07-01/1719839703_NewcriminallawscameFirstcaseregisteredinDelhi.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  కొత్త క్రిమినల్ చట్టాల( criinal law)  ప్రకారం తెలంగాణలో( telangana)  తొలి కేసు నమోదయ్యింది. ఆదివారం రాత్రి నుంచి యావత్తు భారత్ లో ఈ కొత్త నేర , న్యాయ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఈ కొత్త చట్టం కింద మధ్యప్రదేశ్( mp)  లో అర్ధరాత్రి 12-20 గంటలకు ఫస్ట్ కేసు నమోదయ్యింది.


తెలంగాణ రాష్ట్రంలో చార్మినార్( charminar)  పోలీస్ స్టేషన్‌లో( police station)  మొదటి కేసు నమోదయింది. నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త చట్టాల ప్రకారం సెక్షన్ 281 బీఎన్ఎస్, ఎంవీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్‌ను ( digital fir) డిజిటల్‌గా నమోదు చేశారు. 


దేశంలో బ్రిటిష్ పాలన నుంచి కొనసాగుతున్న ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ)కు గత 17వ లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ చట్టాలు జులై 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్ ఫిర్యాదు నమోదు, ఎస్సెమ్మెస్ వంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ వంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయవ్యవస్థలోకి ప్రవేశించాయి.

newsline-whatsapp-channel
Tags : india-people police crime new-laws

Related Articles