GOLD: వామ్మో బంగారం ధరలు...భారీగా పెరుగుతున్న పసిడి, వెండి !

ఈ రోజు మరింత పెరిగింది. దాదాపు తులం మీద వంద పెరిగింది. ఈ రోజు మరింత పెరిగే అవకాశం కూడా ఉందంటున్నాయి


Published Aug 22, 2024 07:38:00 AM
postImages/2024-08-22/1724292563_gold.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి.బంగారం ధర ఈ మూడురోజుల నుంచి కాస్త తగ్గుతూ ...వచ్చింది. ఈ రోజు మరింత పెరిగింది. దాదాపు తులం మీద వంద పెరిగింది. ఈ రోజు మరింత పెరిగే అవకాశం కూడా ఉందంటున్నాయి మార్కెట్ వర్గాలు . ఆగష్టు నెలలో దాదాపు గా పది ,20 తగ్గుతూ పెరుగుతూనే ఉన్నాయి.


విజయవాడ, హైదరాబాద్ లో మాత్రమే కాకుండా ముంబై, బెంగళూరు, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్ లలో కూడా బంగారం ధర ఈరోజు రూ. గ్రాము బంగారం 7,600గా నడుతస్తుంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 7,311 రూపాయిలుగా ఉంది.క్యారెట్లకు తగ్గింది. అన్ని ప్రాంతాల్లోను బంగారం ధర దాదాపు 100 పెరిగి 22 క్యారట్ల బంగారం 66వేల 700 గా నమోదయ్యింది. 24 క్యారట్ల ధర అయితే 72వేల 750 రూపాయిలుగా ఉంది. 


గత జూన్ నెల నుంచి మధ్యలో బ్రేక్ ఇచ్చింది.కానీ మళ్ళీ ఆగస్టు నెలలో  చైనా సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోలు మళ్ళీ ప్రారంభించింది. దీని వల్ల బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇది మార్కెట్ వర్గాలకు మంచి వార్త. ఈ నెల నుంచి బంగారం మరింత పెరుగుతూ సామాన్యుల నడ్డి విరుస్తుంది..ఇప్పుడు బంగారం రేటు తగ్గడం కల గానే మిగిలేలా ఉంది. పది ,20 తప్ప వేలల్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు. వెండి అయితే 87600 గా నడుస్తుంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles