Gold : తగ్గిన వెండి రేటు- పెరిగిన బంగారం రేట్లు ..హైదరాబాద్ లో పసిడి రేటు ఎంతంటే?

దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. గ్రాము మీద పది రూపాయిలు పెరిగింది.


Published Aug 12, 2024 09:32:36 PM
postImages/2024-08-13/1723516267_gold.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. గ్రాము మీద పది రూపాయిలు పెరిగింది. దాదాపు రెండు మూడు రోజుల నుంచి బంగారం పెరుగుతూనే వచ్చింది. ఈ రోజు కూడా బంగారం రేటు పెరిగింది .10గ్రాముల పసిడి ధర రూ. 10 పెరిగి.. రూ. 64,710కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 64,700గా ఉండేది. ఇక 100 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,47,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,471గా కొనసాగుతోంది.


మరోవైపు 24 క్యారెట్ల బంగారం10 గ్రాములు 70,590కి చేరింది. నిన్న 70,580గా ఉండేది. రోజు పద రూపాయిలు పెరిగింది.హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 64,710గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 70,590గా నమోదైంది. దాదాపు తెలుగు రాష్ట్రాలన్నింటిలోను ఇదే రేట్లు నడుస్తున్నాయి. అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 64,760గా.. నమోదయ్యింది. 


వెండి కూడా..
దేశంలో వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,240గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 82,400గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 82,500గా ఉండేది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu goldrates silver-rate

Related Articles