GOLD: ధర తగ్గిన బంగారం... తులం ఎంతకు దిగొచ్చిందంటే?

అంతర్జాతీయంగా రేట్లు పడిపోవడమే బంగారం రేటు తగ్గడానికి కారణమంటున్నాయి మార్కెట్ వర్గాలు.


Published Aug 17, 2024 08:29:00 AM
postImages/2024-08-17/1723863680_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:బంగారం కొనాలనుకునేవారు ...ఈ రోజు తీసుకొండి. 6 రోజుల్లో ఈ రోజు కాస్త బంగారం తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా రేట్లు పడిపోవడమే బంగారం రేటు తగ్గడానికి కారణమంటున్నాయి మార్కెట్ వర్గాలు. ప్రస్తుతం దేశీయంగా పసిడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


 ఢిల్లీలో చూస్తే ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన పసిడి రేటు రూ. 130 పడిపోయి తులం రూ. 65,810 పలుకుతోంది. అంతకుముందు రోజు రూ. 950 పెరగ్గా.. 4 రోజుల్లోనే రూ. 2150 పెరిగింది. వారం రోజుల్లో ఇదే భారీగా తగ్గడం . ఇప్పటి వరకు దాదాపు  10 రూపాయిలు తగ్గేది .ఇదే సమయంలో 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 110 పతనంతో 10 గ్రాములకు రూ. 24 క్యారట్ల బంగారం ధర 71,660 వద్ద ఉంది. ఇక్కడ కిందటి రోజు ఏకంగా రూ. 1040 పెరగడం గమనార్హం


అంతర్జాతీయ మార్కెట్లో చూసినట్లయితే స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 2450 డాలర్ల వద్ద ఉంది. అంతకుముందు ఇది ఒక దశలో 2470 డాలర్లపైకి కూడా చేరింది. ఇక స్పాట్ సిల్వర్ ధర 27.65 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.98 వద్ద ఉంది.


దేశవ్యాప్తంగా వెండి రేట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో కిలో వెండి ధర 500 రూపాయిలు పెరిగి 84,100 కు చేరుకుంది. దాదాపు అన్ని రాష్ట్రాలోను ఇదే రేటుకు అమ్ముడవుతుంది. అయితే బంగారం మాత్రం హైదరాబాద్ లో 22 క్యారట్ల 65,660 రూపాయిలు కాగా 24 క్యారట్ల బంగారం 71,630 గా ఉంది. ఈ రోజు వడోదర లో మాత్రమే బంగారం 22 క్యారట్ల 65710 రూపాయిలు ధరలో ఉంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles