GOLD: భారీగా పెరిగిన బంగారం ధర..వెండి అయితే ఆల్ టైం రికార్డు ధర

ఈ రోజు ఒక్క రోజులో తులం 1050 రూపాయిల మేర పెరిగింది. వెండి అయితే కేజీ మీద 2వేల రూపాయిలు పెరిగింది.


Published Aug 18, 2024 08:15:00 AM
postImages/2024-08-18/1723949213_gold6001723643762.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం అంటే భయమేస్తుంది. మధ్యతరగతి వారికి మరింత దూరం చేస్తూ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ ఈ రోజు ఒక్క రోజులో తులం 1050 రూపాయిల మేర పెరిగింది. వెండి అయితే కేజీ మీద 2వేల రూపాయిలు పెరిగింది. అంతర్జాతీయంగా రికార్డ్ గరిష్ఠాల్లో బంగారం ధరలు ట్రేడవుతున్నాయి. 


అమెరికా పెద్ద బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించేందుకు సిద్ధమవడం, ఆర్థిక మాంద్యం భయాలు తగ్గుముఖం పట్టం, వడ్డీ రేట్ల కోత నేపథ్యంలో అంతర్జాతీయం బంగారానికి డిమాండ్ పెరిగింది. దేశంలో బంగారం మీద పెట్టుబడి పెట్టడం చాలా ఎక్కువైంది. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. ప్రస్తుతం ఒక్క భారత్ లోనే కాదు...అన్ని దేశాల్లోను బంగారం రేట్లు పెరిగాయి.


హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై ఏకంగా రూ.1050 పెరిగింది. ఇప్పుడు బంగారం ధర 66వేల 700 స్థాయికి చేరింది. 24 క్యారట్ల పసిడి ధర తులంపై 1150 పెరిగి..72 వేల 770 దగ్గర పలుకుతుంది. ఇక ఢిల్లీలో 66వేల 850 పలుకుతుంది. వెండి రేటు రూ.2000 పెరిగి రూ. 86 వేల స్థాయిని తాకింది. వెండి రేటు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు మార్కెట్ వర్గాలు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles