gold : భారీగా తగ్గిన పసిడి ధరలు ..ఈ వారంలో ఇదే మంచి రేటు ?

 బంగారం గ్రాము మీద 100 రూపాయిలు తగ్గింది. దేశీయంగా అంతర్జాతీయంగా గోల్డ్ , సిల్వర్ రేట్లు చూద్దాం.


Published Aug 15, 2024 07:55:00 AM
postImages/2024-08-15/1723688810_gold01.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం కొనాలనుకునే వారికి చాలా మంచి ఊరట. దాదాపు వారం నుంచి బంగారం పెద్దగా తగ్గలేదు..పెరగలేదు...పది ఇరవై తగ్గుతూ ...పెరుగుతూ మార్కెట్ ధర అలా సాఫీగా సాగుతుంది. కాని దాదాపు 6 రోజుల తర్వాత  బంగారం గ్రాము మీద 100 రూపాయిలు తగ్గింది. దేశీయంగా అంతర్జాతీయంగా గోల్డ్ , సిల్వర్ రేట్లు చూద్దాం.
ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే.. డాలర్, బాండ్ ఈల్డ్స్ గిరాకీ పడిపోయి గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. ఈ సంకేతాలతోనే ఇటీవల బంగారం ధరలు పుంజుకున్నాయి. 22 క్యారట్లకు చెందిన పసిడి ధర 100 రూపాయిలు రేటు తగ్గి 65,700 పలుకుతుంది.

దాదాపు వారం రోజుల్లో 2150 రూపాయిలు పెరిగింది. ఇప్పుడు గ్రాము మీద 100 తగ్గడం.. 10 గ్రాముల మీద వెయ్యి రూపాయిలు తగ్గినట్లే.24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 110 పతనంతో 10 గ్రాములకు రూ. 71,660 వద్ద ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ ధర 22 క్యారెట్లకు 10 గ్రాముల బంగారం  65,550 వద్ద ఉంది. 24 క్యారెట్స్ పుత్తడి ధర రూ. 110 తగ్గి ఇప్పుడు 10 గ్రాములు రూ. 71,510 వద్ద ఉంది.


వెండి కూడా భారీ గానే తగ్గింది. హైదరాబాద్ నగరంలో కేజీ సిల్వర్ రేటు రూ. 500 తగ్గి ప్రస్తుతం రూ. 88 వేలకు చేరింది. నిన్న ఒక్క రోజే వెండి కేజీ 1000 పెరిగింది. ఢిల్లీలో కేజీ వెండి 83 వేలు ..ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 88 వేల మార్కెట్ నడుస్తుంది. దీనికి తోడు జీఎస్టీ , మేకింగ్ ఛార్జీలతో ధర ప్రతి షాపుకు వేరు వేరుగా ఉంటుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles