RTC: ఉచిత బస్సు ఎఫెక్ట్.. ఎక్స్‌ప్రెస్ బస్సులు బంద్ 2024-06-25 07:56:13

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టింది. అయితే దీని వల్ల ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అధిక సంఖ్యలో మహిళలు ఎక్కుతున్నారు. దాంతో ఆదాయం రావడం లేదని ఆర్టీసీ పేర్కొంది. అందుకే కొన్ని డిపోల్లో దూర ప్రయాణాలకు ఎక్స్‌ప్రెస్ బస్సులకు బదులు డీలక్స్ బస్సులను నడుపుతున్నారు. డీలక్స్ బస్సుల్లో అయితే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవ్వదు.

మహిళలు డీలక్స్ బస్సు ఎక్కాలని ప్రతి 15 రోజులకు ముగ్గురు మహిళలను లక్కీ డ్రా ద్వారా బహుమతులు ఇస్తామని ఈ పథకం పెట్టారు. కాగా, ఇప్పటికే మహబూబ్ నగర్ - మిర్యాలగూడ ఎక్స్‌ప్రెస్, కోదాడ - కర్నూల్ ఎక్స్‌ప్రెస్, భూపాలపల్లి - గుంటూరు ఎక్స్‌ప్రెస్, పరకాల - గుంటూరు ఎక్స్‌ప్రెస్, కరీంనగర్ - నరసరావు పేట ఎక్స్‌ప్రెస్ లను రద్దు చేయగా, సూర్యాపేట - జనగామకు మధ్య ఆర్డినరీ బస్సులను నడుపుతున్నారు.