Dead frog: చిప్స్ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప...! 2024-06-20 21:19:38

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నిన్న బెంగుళూరులో( baglore)  అమేజాన్ డెలివరీలో పాముని( snake) పెట్టి డెలివరీ చేసింది అమేజాన్. పాపం డెలివరీ( delivery)  తీసుకున్నవ్యక్తి పాముని చూసి హడలి చచ్చారు. ఇప్పుడు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో చిప్స్ ప్యాకెట్ లో కప్ప కనిపించింది. దీంతో చిప్స్ కొనుకున్న వ్యక్తి  మున్సిపల్ అధికారులు బుధవారం విచారణకు ఆదేశించారు. 


బాలాజీ వేఫర్స్ ( balaji waffers) అనే కంపెనీ తయారు చేసిన క్రంచెక్స్ ( crunchex) అనే పొటాటో చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప కనిపించిందంటూ ఒకరి నుంచి తమకు ఫిర్యాదు అందిందని జామ్‌నగర్( jam nagar)  మునిసిపల్ అధికారులు వివరించారు. మంగళవారం సాయంత్రం ఈ చిప్స్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశారని, ఫిర్యాదు అందగానే సంబంధింత దుకాణం వద్దకు వెళ్లామని, ప్రాథమిక విచారణలో అది కుళ్లిపోయిన కప్ప ( frogg)అని గుర్తించామని ఫుడ్‌ సేఫ్టీ ( food safty) అధికారి డీబీ పర్మార్‌ వివరించారు. అయితే షాప్ వ్యక్తి తప్పిదం కాదని కంపెనీపైనే చర్యలు చేపట్టాలని అన్నారు.


నాలుగేళ్ల పాప  షాపుకు వెళ్లి ఈ చిప్స్ తెచ్చుకుందని ...కప్పను గుర్తించడానికి ముందు తన మేనకోడలు, తన కూతురు ఇద్దరూ కొన్ని చిప్స్ తిన్నారని వివరించాడు. కప్పను చూసిన వెంటనే ప్యాకెట్‌ను విసిరికొట్టారని, కప్ప ఉందని చెబితే తొలుత నమ్మలేదని పటేల్ పేర్కొన్నారు. బాలాజీ వేఫర్స్ డిస్ట్రిబ్యూటర్, కస్టమర్ కేర్ సర్వీస్‌కు ఫిర్యాదు చేయగా సంతృప్తికరమైన సమాధానం రాలేదని, దీంతో బుధవారం ఉదయం ఫుడ్ సేఫ్టీ అధికారికి సమాచారం అందించానని పటేల్ వివరించారు.