మధ్యవయసు వారు తమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. గంటల తరబడి వ్యాయామం తర్వాత వారి జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అరగంటపాటు వ్యాయామం చేస్తే ..బ్రిస్క్ వాకింగ్ , సైక్లింగ్ , డ్యాన్సింగ్ వంటివి చేయడం వల్ల మీ వయసు తక్కువగా కనిపిస్తుంది. ప్రతి రోజు చేసే వ్యాయామం చేస్తే గుండె ఆరోగ్యమే కాదు..టైప్ 2 డయాబెటిస్ వంటి వాటిని దూరంగా ఉంచుతుంది. శరీర బరువును కూడా అదుపులోకి పెట్టడమే కాదు రక్తం కూడా సరిగ్గా సప్లై అవుతుంది. మధ్యవయసు వారు తమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. గంటల తరబడి వ్యాయామం తర్వాత వారి జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
సగటున 50 నుంచి 83 ఏళ్ల మధ్య వయసున్న వారి నుంచి కఠినమైన వ్యాయామం తర్వాత వారి మెదడు చురుకుదానాన్ని పొంది, జ్ఞాపకశక్తిలో గణనీయమైన మార్పును శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తం 76 మందిపై 8 రోజుల పాటు నిర్వహించిన అధ్యయనం లో ఈ విషయాన్ని చెప్పారు . రోజుకు అరగంటపాటు వ్యాయాయం, కంటి నిండా నిద్ర తర్వాత వారి జ్ఞాపకశక్తిని పరీక్షించేందుకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించగా మంచి స్కోరు సాధించినట్టు అధ్యయనకారులు తెలిపారు.వ్యాయామం మీ బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది.