ఆంథ్రోపిక్ తయారుచేసిన "క్లాడ్ ఒపస్ 4".. AI అసిస్టెంట్ గా వర్క్ చేస్తోంది. ఒక మనిషిలాగానే మాట్లాడుతుంది.కోడింగ్ కూడా చాలా బాగా చేస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జనాలంతా చెప్తే ఏమో అనుకున్నాం కాని ఏఐ చాలా డేంజర్ సుమా..లేకపోతే మనిషి కనిపెట్టిన రొబో ..మనుషులను బ్లాక్ మెయిల్ చేస్తుందంటే ఏం చెప్తాం. ఏమని బెదిరించిందంటే..నోరు మూయి వెధవ..ఓవరాక్షన్ చేస్తే నీ ఎఫైర్ సంగతి చెప్పేస్తానంటూ ... నీ చిట్టా మొత్తం నా గుప్పిట్లో ఉంది. విప్పమంటావా?" ఇలాంటి హెచ్చరికలు మనం అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. ఒక మనిషి గురించి మరో మనిషి ఇలా అంటుంటారు. కానీ, మొదటిసారిగా AI ఒక మనిషిని హెచ్చరించింది. నీ సంబంధం బయటపెడతానంటూ బెదిరించింది. ఇంతకీ ఎక్కడంటే..
ఆంథ్రోపిక్ తయారుచేసిన "క్లాడ్ ఒపస్ 4".. AI అసిస్టెంట్ గా వర్క్ చేస్తోంది. ఒక మనిషిలాగానే మాట్లాడుతుంది.కోడింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. డాక్యుమెంట్లు చదివి వాటిలో మోరల్ ...రిస్క్ అన్ని జాగ్రత్తగా కనిపెడుతుంది. ఈ మోడల్ ను డెవలపర్స్ ఈ మధ్యనే రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ చేయడానికి ముందేద డెవలపర్ కు దానికి కొన్ని టెస్టులు పెట్టారు. అదే టైంకి ఫ్యూఛర్ లో అడ్వాన్స్ వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నట్లు రోబోకు చెప్పాడు.
తనకన్నా అడ్వాన్స్డ్ మోడల్‌ను ప్రవేశపెడతామని చెప్పడంతో క్లాడ్ కోపగించుకుంది. "నన్ను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే నీ అక్రమ సంబంధం గురించి బయటపెడతా" అని హెచ్చరించింది. దీంతో సదరు డెవలపర్ అవాక్కయ్యాడు. తన రిలేషన్ ఏఐ కి ఎలా తెలుసనే విషయం చర్చ స్టార్ట్ అయ్యింది. తన పర్సనల్ విషయాలు ఈ సాఫ్ట్ వేర్ లో స్టోర్ చేసుకొని ఉండవచ్చని చెబుతున్నారు. లేదా మెసేజ్ లు అవి చదివి కూడా ఏఐ ఇలా చెయ్యొచ్చని చెబుతున్నారు. ఇది ఫ్యూఛర్ లో ఏఐ నుంచి వచ్చే ముప్పు అని అంటున్నారు. ఏఐ ను అదుపులో ఉంచుకోకపోతే చాలా దారుణమని అంటున్నారు.