ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఆమె అమెరికా చేరుకున్నారు. ఆమెను బోస్టన్ ఎయిర్ పోర్టులోనే అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అమెరికా నుంచి ఓ లెబనాన్ లేడీ డాక్టర్ ను బహిష్కరించారు. అయితే రాషా అలవీ అనే లెబనాన్ డాక్టర్ ను తమ దేశం నుంచి అమెరికా బహిష్కరించింది. హెజ్ బొల్లాతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ అమెరికా ఆమెను బ్యాన్ చేసింది.
నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఆమె అమెరికా చేరుకున్నారు. ఆమెను బోస్టన్ ఎయిర్ పోర్టులోనే అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బ్రోన్ మెడిసిన్ లో కిడ్నీ డిసీజ్ తో పాటు , హై బీపీ ఇన్ రోడ్ ఐలాండ్ లో 2024 జులై నుంచి ఆమె పనిచేస్తున్నారు. 2015 లో అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బైరూట్ మెడికల్ డిగ్రీ పట్టా పొందారు.
ఇదే సంస్థలో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు.బ్రోన్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం జరగడానికి ముందు ఓహియో స్టేట్ యూనివర్శిటీ, వాషింగ్టన్ యూనివర్శిటీ పరిధిలో ఇంటర్నల్ మెడిసిన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.హెచ్ 1 బీ వీసా కూడా ఆమెకు మంజూరైంది. 2027 మధ్య నాటి వరకు హెచ్ 1 బీ వీసా గడువు ఉంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 23 న అమెరికాకు చేరుకుంది. హెజ్ బొల్లాతో సంబంధాలు ఉండడంతో ఆమెను అమెరికా ప్రభుత్వం బహిష్కరిస్తుంది.