పిల్లలు మొండిగా  బిహేవ్ చేస్తున్నారా..అయితే కష్టమే.!

ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని అతి గారాబంగా పెంచుతున్నారు. దీంతో పిల్లలు ఓ స్టేజ్ కి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాట అస్సలు వినడం లేదు. దీంతో సైకోలా బిహేవ్ చేస్తూ తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారుతున్నారు. దీనికి కారణాలేంటి వారిని మార్చాలంటే మనం ఎలా ఉండాలి అనేది వివరాలు చూద్దాం..కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు మాట వినడం లేదని మొండిగా తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-09/1720504525_child.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని అతి గారాబంగా పెంచుతున్నారు. దీంతో పిల్లలు ఓ స్టేజ్ కి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాట అస్సలు వినడం లేదు. దీంతో సైకోలా బిహేవ్ చేస్తూ తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారుతున్నారు. దీనికి కారణాలేంటి వారిని మార్చాలంటే మనం ఎలా ఉండాలి అనేది వివరాలు చూద్దాం..కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు మాట వినడం లేదని మొండిగా తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.

దీంతో పిల్లల అప్పటి మందం కాస్త భయపడినా కానీ తర్వాత విపరీతమైన మొండిగా తయారవుతారు.  ఇక మీరు కట్టెలతో కొట్టిన వారు భయపడరు. అలా కాకుండా పిల్లల్ని ప్రేమతో, దగ్గరికి తీసుకొని మంచి మాటలు చెప్పాలని అంటున్నారు. దీనివల్ల పిల్లలు ఏదో ఒక టైంలో అర్థం చేసుకుంటారని తెలియజేస్తున్నారు. 

 ప్రేమ దగ్గరకు తీసుకోండి:
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు మాట వినడం లేదని విపరీతంగా కొడుతూ ఉంటారు. అంతేకాకుండా బూతులు తిడుతూ ఉంటారు. ప్రతి పనికి తిట్టడానికి బదులు వారితో మెల్లిగా అర్థం చేసుకునేలా చెప్పండి. దీనివల్ల వారు కొంతసేపు మొండిగా ఉండి, ఆ తర్వాత సెట్ అయిపోతారు.  తిట్టారంటే కొద్దిసేపు భయంగా ఉన్నట్టు ప్రవర్తించి ఆ తర్వాత మళ్లీ అదే రిపీట్ చేస్తారు. అప్పుడు మీరు తిట్టినా ప్రయోజనం ఉండదు. ప్రేమతో అర్థం చేసుకునేలా చెప్పండి. 

 మర్యాద:
 ముఖ్యంగా పిల్లలకు పెద్దలను గౌరవించడం పెద్దవారితో మర్యాదగా మాట్లాడడం తప్పనిసరిగా నేర్పాలి. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా వారి పెద్దవారిని గౌరవిస్తే మన పిల్లలు కూడా పెద్దవారిని గౌరవించడం నేర్చుకుంటారు. 

 మాటలు:
తల్లిదండ్రులు వారి పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కఠినమైన మాటలు మాట్లాడకూడదు. అలాగే కఠినమైన పదాలను కూడా వాడకూడదు. దీనివల్ల మీ పిల్లలు అద్భుతమైన పదజాలం నేర్చుకుని ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కాబట్టి పిల్లల ముందు తల్లిదండ్రులు తిట్టుకోవడం చెడు పదాలు మాట్లాడడం అస్సలు చేయకండి. 

 చిరాకు:
 పిల్లలు ఏదైనా విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప, చిరాకు పడకూడదని అంటున్నారు నిపుణులు.  దీనివల్ల పిల్లలకు ఏదైనా పర్సనల్ మ్యాటర్ చెప్పాలన్నా కానీ మీకు భయపడి పోతారు. కాబట్టి పిల్లలతో చాలా ఫ్రీగా అన్ని వారు మీతో చెప్పుకునేలా బిహేవ్ చేయండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-benifits healthy- childhood crying

Related Articles