చీమా అని చీప్ గా చూస్తున్నారా..ఆపరేషన్ కూడా చేయగలవు.!

చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు పామరుడు దగన్ అనే పద్యం అందరికీ తెలుసు. దీని అర్థం చీమలు ఎంతో కష్టపడి పెట్టిన పుట్టలను పాములు ఆక్రమించుకొని అందులో నివసిస్తాయి. దీన్ని బట్టి చూస్తే మాత్రం చీమలు ఎంత కష్టం చేస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు.  కేవలం చీమలు కష్టపడి పుట్టలు కట్టడమే కాదు, కష్టాల్లో ఉన్న వారిని కూడా ఆదుకుంటాయి, సర్జరీలు చేసి వారిని బ్రతికిస్తాయి అని నిరూపిస్తున్నాయి.  ఇదేంటి చీమలు మనల్ని కుడతాయి తప్ప సర్జరీలు చేయడం ఏంటని మీరు అనుకుంటున్నారు కదు. అవునండి మీరు విన్నది నిజమే..


Published Jul 05, 2024 09:04:00 PM
postImages/2024-07-05/1720191814_ant.jpg

న్యూస్ లైన్ డెస్క్: చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు పామరుడు దగన్ అనే పద్యం అందరికీ తెలుసు. దీని అర్థం చీమలు ఎంతో కష్టపడి పెట్టిన పుట్టలను పాములు ఆక్రమించుకొని అందులో నివసిస్తాయి. దీన్ని బట్టి చూస్తే మాత్రం చీమలు ఎంత కష్టం చేస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు.  కేవలం చీమలు కష్టపడి పుట్టలు కట్టడమే కాదు, కష్టాల్లో ఉన్న వారిని కూడా ఆదుకుంటాయి, సర్జరీలు చేసి వారిని బ్రతికిస్తాయి అని నిరూపిస్తున్నాయి.  ఇదేంటి చీమలు మనల్ని కుడతాయి తప్ప సర్జరీలు చేయడం ఏంటని మీరు అనుకుంటున్నారు కదు. అవునండి మీరు విన్నది నిజమే..

చీమలు సర్జరీలు కూడా చేయగలవు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా చీమలు ఏదైనా వస్తువును  పక్కకు జరపాలి అంటే అన్నీ కలిసి ముకుమ్మడిగా  ఒక పట్టు పట్టి పక్కకు జరిపేస్తాయి. అలాంటి ఇవి వాటి చీమల్లో ఎవరికైనా గాయం తగిలితే  డాక్టర్లలా కూడా మారుతాయట. ఇదేదో ఊరికే చెప్పింది కాదు ఒక అధ్యాయంలో వెల్లడయింది. మెగా ఫోనేరా అలాగే మాటబేలే చీమల జాతులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. జర్మనీకి చెందినటువంటి  యూనివర్సిటీ ఆఫ్ ఊర్జుబర్గ్  సైంటిస్టులు రీసెర్చ్  చేసి  విషయాన్ని బయటపెట్టారు. మనిషి తర్వాత  చికిత్స చేసే రెండవ జీవి చీమా అని వారు తెలియజేశారు.

రీసెర్చ్ చేసే వ్యక్తి ఒక చీమను పట్టుకొని దాని కుడి తొడ కింది భాగాన్ని కోసి వదిలేసారు. అంతేకాదు ఆ శాస్త్రవేత్తలు ఆ చీమకు మైక్రో కెమెరాలు అమర్చారు. అలా గాయపడిన చీమ తోటి చీమలు ఉండే ప్రాంతానికి వెళ్ళింది. దీంతో దాని చుట్టూ 20 నుంచి 25 చీమలు చేరి దాన్ని పుట్ట లోపలికి తీసుకెళ్లాయి.  చీమ నుంచి రక్తం కారకుండా వాటి నోటిలో నుంచి లాలాజలాన్ని తీసి గాయంపై పూసాయి.

ఇక ఆ గాయం పూర్తి శరీరమంతా పాకకుండా, ఆ గాయపడిన తొడ భాగాన్ని చీమలు కొరుకుతూ పైనుంచి పూర్తిగా తొలగించాయి. ఆ తర్వాత ఆ  భాగంపై వాటి లాలాజలాన్ని ఉంచడంతో  రక్త స్రావం ఆగిపోయి కేవలం 40 నిమిషాల్లో చీమ సాధారణ స్థితికి చేరుకుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీన్నిబట్టి చీమలు మనుషులు లాగే సర్జరీలు చేసి వాటి ప్రాణాలను అవే కాపాడుకుంటాయని  కరెంట్ బయాలజీ జర్నల్ లో ప్రచురించారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu scientist carrent-biology ant operation

Related Articles