ఆటో లో సీటింగ్ అంతా ఆర్టిఫిషియల్ గ్రాస్ తో ఫుల్ కవర్ చేశాడు. ఇక ఆటో టాప్ ..చుట్టు చక్కని మొక్కలు కుండీలతో సహా ఏర్పాటుచేశాడు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కార్ , క్యాబ్ ఏది ఎక్కడినా ఈ ఎండకి అన్ని ఏసీలే. చల్ల గాలి అంటే ఏసీ గాలే అన్నట్లు ఫీలవుతున్నాం. కాని ఓ ఆటో డ్రైవర్ ఎర్రటి ఎండలో బయటకు వెళ్లినా ఏసీకి మించిన చల్లని గాలి రావడానికి ప్లాన్ చేశాడు . ఎండ వేడి నుంచి ఉపశమనం లభించాలంటే పచ్చదనాన్ని మించిన మరో పరిష్కారం లేదని భావించిన ఆటోవాలా వెంటనే తన ఆటోను ఒక కదిలే వనంలా మార్చేశాడు.
ఆటో లో సీటింగ్ అంతా ఆర్టిఫిషియల్ గ్రాస్ తో ఫుల్ కవర్ చేశాడు. ఇక ఆటో టాప్ ..చుట్టు చక్కని మొక్కలు కుండీలతో సహా ఏర్పాటుచేశాడు. ఈ ఆటో ఎక్కిన కస్టమర్లకు పచ్చటి ఆకులు చుట్టూ ఉండి , ఎండవేడి నుంచి తప్పించుకోవడానికి ఇలా ఆహ్లాదాన్ని కూడా అందిస్తున్నాయి. చాలా తక్కువ ఖర్చుతోనే ఏసీ ని మించిన చల్లదనాన్ని క్రియేట్ చేసి పొల్యూషన్ తో నిండిన రోడ్డు మధ్యలో ఆక్సిజన్ అందిస్తూ కదిలే ఈ ఆటోవాలా అంకుల్ ఐడియాను చూిస నెటిజన్లు శభాష్ అంటున్నారు.
ప్రకృతి ఎప్పటికైనా ప్రపంచాన్ని చల్లగా ఉంచే ఏకైక మార్గం. ఇంట్లో కూడా ఇలా చెట్లను పెంచితే మంచిదని అంటున్నాడు ఈ ఆటో వాలా. తమ ఇళ్లను కూడా ఇలా పచ్చగా మార్చుకుంటే ఏసీ అవసరం లేకుండా చక్కగా హాయిగా ఉండవచ్చని నెటిజన్లు పేర్కొంటున్నారు.