bhagath singh: షహీద్ భగత్ సింగ్ గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవల్సిందే !

మన స్వతంత్యం కోసం ఆయన ప్రాణాలు పనంగా పెట్టిన గొప్ప విప్లవకారుడు. భారతీయ యువకుల్లో బానిసత్వపు అలవాట్లను తరమికొట్టి ..స్వతంత్య భారతీయం కోసం కలలు కనేలా ప్రేరేపించిన ఉత్తముడు.


Published Sep 28, 2024 12:03:18 PM
postImages/2024-09-28/1727542951_69647zykhajlhza1703238324.jpeg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వహీద్ భగత్ సింగ్ లెంజరీ విప్లవకారుడు. భారతీయుల్లో ఎవరికైనా భగత్ సింగ్ పేరు తెలియకపోతే ...మీరు భారతీయుడని చెప్పుకునే అర్హత లేనట్టే. మనం అనుభవించే స్వేఛ్ఛ కు ఆయన ఊపిరే పునాది. స్వతంత్ర్య భారతదేశం మనకు మాటలే..ఆయన ఎన్నో రాత్రుల కల. మన స్వతంత్యం కోసం ఆయన ప్రాణాలు పనంగా పెట్టిన గొప్ప విప్లవకారుడు. భారతీయ యువకుల్లో బానిసత్వపు అలవాట్లను తరమికొట్టి ..స్వతంత్య భారతీయం కోసం కలలు కనేలా ప్రేరేపించిన ఉత్తముడు.


బ్రిటీష్ ఇండియాలోని పంజాబ్‌లోని బంగాలో 28 సెప్టెంబర్ 1907న సిక్కు కుటుంబంలో భగత్ సింగ్‌ పుట్టారు. పంజాబ్ రక్తంలోనే దేశ భక్తి నిండి ఉందంటారు. అలాంటి సిక్కే భగత్ కూడా. 23 యేళ్ల వయసులో భారతదేశం కోసం తెల్లదొరల ముందు గొంతెత్తి మాట్లాడిన వీరుడు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలను కూడా లెక్క చెయ్యలేదు. లాహోర్ కుట్ర కేసులో బ్రిటీష్ ప్రభుత్వం అతనికి 23 మార్చి 1931న మరణశిక్ష విధించింది. 
అతని చిన్నప్పటి నుంచే ఎన్నో వేల సంఘటనలు చూశాడు. భారతీయులు బ్రిటిష్ కాళ్ల కింద నలిగిపోవడం..అడుగడుగునా భారతీయుల పై బ్రిటిష్ అధికార దాహాం, పెత్తనం, బానిసత్వం, తన 12 సంవత్సరాల వయసులో భగత్ సింగ్ జలియన్ వాలా బాగ్ మారణ కాండను చూశాడు. ఆ తర్వాత అతను బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి విముక్తి ఇప్పిస్తానని శపధం చేశాడు. దీని కోసం తన ప్రాణాలే ఇచ్చేశాడు కూడా.


అతను హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడు. ఒకసారి, భగత్ సింగ్ తండ్రి కిషన్ సింగ్ అతనిని విడుదల చేయడానికి ₹ 60,000 భారీ మొత్తాన్ని చెల్లించవలసి వచ్చింది . అంత మొత్తం చెల్లించలేకపోయినా ప్రయత్నించాడు. లాలా లజపతిరాయ్ ను బ్రిటిష్ వారు క్రూరంగా కొట్టారు. క్రమేణా ఆ దెబ్బలు తట్టుకోలేక లాలా లజపతి రాయ్ చనిపోయారు. ఆయన మరణం భగత్ సింగ్ కు మరింత ఉక్రోషం తెప్పించింది. తనతో పాటు తన తోటి విప్లవకారులు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు.భగత్ సింగ్, సుఖ్‌దేవ్ మరియు రాజ్‌గురు లాలా మరణానికి కారణమైన జాన్ పి. సాండర్స్ (జేమ్స్ ఎ. స్కాట్‌గా పొరబడ్డాడు) పోలీసు అధికారిని లక్ష్యంగా చేసుకున్నారు. అయితే అతని అటాక్ చేసే టైంలో భగత్ సింగ్ తో పాటు మరో ఇద్దరు విప్లవకారులను బ్రిటిష్ పోలీసులు పట్టుకున్నారు. 


అయితే విచారణ జరిపి ఉరిశిక్ష విధించారు బ్రిటిష్ అధికారులు. మార్చి 24న ఉరిశిక్ష విధించాలని నిర్ణయించినా ..ఎవ్వరికి తెలీకుండా రహస్యంగా మార్చి 23న 1931 న భగత్ సింగ్ ఉరితీశారు. ఒక్క భగత్ సింగ్ మరణం కొన్నివేల మంది విప్లవకారులను తయారుచేసింది. భగత్ మాటలు ...త్యాగం ఎందరో యువకులను స్వతంత్ర్య కోసం పోరాటయోధులుగా మార్చింది. అతని త్యాగం భారత్ మరిచిపోదు. ఎన్ని తరాలు మారిన భగత్ సింగ్ లాంటి వీరులకు ప్రజలు రుణపడేఉండాలి. జైహింద్ .

newsline-whatsapp-channel
Tags : newslinetelugu india bhagath-singh freedom-fighter

Related Articles