BIGBOSS: ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషనే ...శివంగి అవుటా !

ఈ వారం డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందని.. శనివారం ఒకరు, ఆదివారం మరొకరు ఎలిమినేట్​ అయ్యి టాప్​ - 5 కంటెస్టెంట్స్​ ఫినాలేకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 


Published Dec 07, 2024 08:57:00 PM
postImages/2024-12-07/1733585315_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ 8 క్లైమాక్స్ కి వచ్చేసింది. ఈ వారం దాటితే ..ఇక ఫైనల్సే. ఓటింగ్ కూడా అయిపోయింది. టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనలిస్ట్ అయిన అవినాష్ మినహా మిగిలిన వారందరూ నామినేషన్స్ లో ఉన్నారు. గ్రాండ్ ఫినాలే కి ముందు జరుగబోతున్న ఎలిమినేషన్ కావడం తో క్రేజీ గా ఓట్లు పడ్డాయని టాక్. గత వారం మాదిరే ఈ వారం డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందని.. శనివారం ఒకరు, ఆదివారం మరొకరు ఎలిమినేట్​ అయ్యి టాప్​ - 5 కంటెస్టెంట్స్​ ఫినాలేకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 


ఇఫ్పుడున్న ఏడుగురులో నలుగురు అబ్బాయిలు..ముగ్గురు అమ్మాయిలు ...అందులో ఇద్దరు విష్ణు,  రోహిణి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారని టాక్. అన్​అఫీషియల్​ పోలింగ్​లో నిఖిల్, గౌతమ్‌ల మధ్య నువ్వా నేనా అంటూ ఓటింగ్ జరిగింది. దాదాపు 70 పర్సెంట్ ఓటింగ్‌ని వీళ్లిద్దరే షేర్ చేసుకున్నారు. నిఖిల్ విన్నర్ అని కొందరు...గౌతమ్ అని  కొందరు  పోటీ పడి మరీ ఓటేస్తున్నారు.


మొదటి రెండు స్థానాల్లో నిఖిల్​, గౌతమ్​ ఉంటే ఆ తర్వాతి స్థానాల్లో వరుసుగా ప్రేరణ, నబీల్​, విష్ణుప్రియ, రోహిణి ఉన్నారు. ముఖ్యంగా రోహిణికి, విష్ణుప్రియకు చాలా తక్కువ వ్యత్యాసంతో ఓటింగ్​ పోల్​ అయినట్లు తెలుస్తోంది. అన్​అఫీషియల్​ ఓటింగ్​ ప్రకారం రోహిణి తర్వాత డేంజర్​లో విష్ణుప్రియ, నబీల్​ ఉన్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bigboss8 vishnu-priya elimination

Related Articles