సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు మంచిర్యాల జిల్లా మీదుగానే వెళ్లాల్సి ఉంది. అయితే ఆ పుష్కరాలకు వెళ్లే వారికి మధ్యలో దేవాలయాలు చాలా ఉన్నాయి
న్యూస్ లైన్ ,స్పెషల్ డెస్క్ : సరస్వతి నది పుష్కరాలు మొదలయ్యాయి. కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాలకు వేలాది భక్తులు హాజరవుతున్నారు. కాళేశ్వరంలో సరస్వతి నది అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వేలాది భక్తులు తరలివస్తున్నారు. సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు మంచిర్యాల జిల్లా మీదుగానే వెళ్లాల్సి ఉంది. అయితే ఆ పుష్కరాలకు వెళ్లే వారికి మధ్యలో దేవాలయాలు చాలా ఉన్నాయి అవేంటో చూద్దాం.
నిజామాబాద్- జగ్దల్పూర్ 63వ జాతీయ రహదారి భక్తులకు పుష్కర మార్గం లో రెండవ అన్నవరం గా పిలవబడే సత్యనారాయణస్వామి, అంబా అగస్తేశ్వరాలయం, జగన్నాథ స్వామి, బైరవస్వామి ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు.
దావరి నది జన్మస్థానమైన నాసిక్-త్రయంబక్ నుంచి మొదలుకొని సముద్రంలో చేరేవరకు మరెక్కడా ఉత్తరదిశగా నది ప్రవహించదు. అయితే కాశీలో గంగానది రెండు క్రోసుల ఉత్తరదివగా ప్రవహిస్తుండగా , చెన్నూరులో గోదావరి అయిదు క్రోసులు ప్రవహిస్తుంది. గుట్టలోని సహజ సిద్ధంగా బండలపై దిగంబరంగా ఉన్న భైరవుడి విగ్రహ రూపాన్ని చూడలేక తిరిగి గోదారమ్మ తల్లి తూర్పు దిశగా వెళ్లిందని స్థల పురాణంలో ఉంది. గుట్టలపై ఉన్న బైరవస్వామికి కొన్నాళ్ల క్రితం అక్కడే ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు.63 వ జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వారు ఈ దేవాలయానికి వెళ్లొచ్చు.
చెన్నూరులోని అంబాఅగస్తేశ్వర ఆలయం పురాతనమైంది. 1289లో కాకతీయరాజైన ప్రతాపరుద్రుడు దీన్ని నిర్మించాడు. అంబా అగస్తేశ్వరాలయం గర్భగుడిలో 410 ఏళ్లుగా అఖండ దీపం నిరంతరాయంగా వెలుగుతుండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ దేవాలయం రెండో పూరీ గా చెబుతారు. జగన్నాథ విగ్రహాల్లాగే ఇక్కడ కూడా ఉంటాయి. మీకు ఈ ప్లేస్ అన్నింటికి ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రత్యేక , సాధారణ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం.