VIRAL VIDEO: తాజ్ మహాల్ పై పాక్ దాడి..వైరల్ అవుతున్న ఏఐ వీడియో !

ఏఐ సాయంతో ఓ వీడియో క్రియేట్ చేసిన వీడియోను షేర్ చేశారు


Published May 12, 2025 08:12:00 PM
postImages/2025-05-12/1747061070_cfedc965012421.5ae5d3a2a1ae6.gif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ , పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు దారుణంగా ఉన్నాయి. ఈ సిట్యువేషన్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఆగ్రాలోని తాజ్ మహల్ పై పాకిస్థాన్ వైమానిక దాడి జరిపిందని కొందరు తప్పుడు ప్రచారం చేశారు. అంతేకాదు ఏఐ సాయంతో ఓ వీడియో క్రియేట్ చేసిన వీడియోను షేర్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అది ఫేక్ అని ఇలాంటి టైంలో అలాంటి వీడియోలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తాయని తెలిపారు. వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించిన సైబర్ క్రైమ్ పోలీసులు, ఏ ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ అయ్యిందో చూసి వారి పై కేసు నమోదు చేశారు.


ఫేక్ మెసేజ్ లు , వీడియోలను పోస్ట్ చెయ్యడం ద్వారా ఉద్రిక్తతలు పెరుగుతాయని ..వ్యాప్తి చేయడడం ఆదివారం రాత్రి కొందరు ప్రయత్నించినట్లు డీసీపీ సోనమ్ కుమార్ తెలిపారు. ఈ వీడియో తయారుచేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. యుధ్ధవాతావరణంలో అఫిషియల్స్ రిలీజ్ చేసిన వీడియోలు తప్ప మరే ఇతర వీడియోలు నమ్మకూడదని తెలిపారు.


 

newsline-whatsapp-channel
Tags : attack artificial-intelligence viral-video tajmahal

Related Articles