viral: బైక్ నచ్చినట్టుంది...డ్రైవింగ్ చేస్తూ చిల్ అయిన ఎద్దు !

అక్కడే చుట్టు పక్కల ఉన్న వారు సెక్యూరిటీ కోసం పెట్టుకున్న సీసీటీవీ పుటేజ్ లో ఇది రికార్డు అయ్యింది.


Published May 03, 2025 08:09:00 PM
postImages/2025-05-03/1746283332_514527bullridebike.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జంతువులే అయినా బోరింగ్ ఏం ఉంటాయ్..వాటికి ఏవో పిచ్చి పిచ్చి పనులు చెయ్యాలనే అనిపిస్తుంది కదా. చిన్నపిల్లల్లాగా భలే క్రేజీ పనులు చేస్తుంటాయి. అయితే పుణ్యక్షేత్రం అయిన రిషికేశ్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన స్కూటర్ ఎక్కిన ఎద్దు అనూహ్యంగా దానిని రైడ్ చేస్తూ ముందుకు దూసుకెళ్లింది. అయితే అక్కడే చుట్టు పక్కల ఉన్న వారు సెక్యూరిటీ కోసం పెట్టుకున్న సీసీటీవీ పుటేజ్ లో ఇది రికార్డు అయ్యింది.


రిషికేశ్‌లోని ఓ రహదారి దాదాపు జనసంచారం లేకుండా ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో ఓ ఎద్దు ఆ మార్గంలో సంచరిస్తూ కనిపించింది. కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఓ స్కూటర్ వద్దకు చేరింది. ఎవరూ ఊహించని విధంగా, అది ఒక్కసారిగా స్కూటర్ మీదకు ఎక్కి సీటుపై కూర్చుంది. కూర్చున్నాక పాపం బ్యాలెన్స్ దొరకక కాస్త దూరం డ్రైవింగ్ కూడా చేసింది. ఆఖరికి  ఓ గోడకు గుద్దుకొని బైకు ఆగిపోయాక ఎద్దు పక్కకు వెళ్లింది,. దానికి కూడా వామ్మో ఏంటి ఇంత రిస్క్ తీసుకున్నా అనిపించే ఉంటుంది. పాపం సైలెంట్ గా పక్కకు వెళ్లిపోయింది.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news

Related Articles