VIRAL: క్రెడిట్ కార్డు బిల్లు కట్టమంటే కుక్కతో దాడి చేయించిన ఓనర్ !

బిల్ కట్టడానికి ఇబ్బందిపెట్టడంతో కుక్కను వదిలాడు .అది ఊరుకుంటుందా పిక్క పీకేసింది


Published May 17, 2025 10:57:00 AM
postImages/2025-05-17/1747459758_dogbiteghaziabadteendies2804355916x9.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: క్రెడిట్ కార్డ్ వాడడం చాలా సులువు. కట్టడమే తల ప్రాణం తోకకి వచ్చేస్తుంది. అప్పు అడగకుండా ఇస్తాడు బ్యాంక్ వాడు...కార్డు గీకితే ఆపేవాడు లేకపోవడంతో తెగ వాడేస్తాం. కట్టేటపుడు జీతానికి బిల్లుకి అసలు మ్యాచ్ అవ్వదు. కట్టడానికి తిప్పలు తప్పవు. కాని ఓ క్రెడిట్ కార్డు బిల్ వసూలు చేయడానికి వెళ్లిన రికవరీ ఏజెంట్ ఓ వ్యక్తిపై కుక్కతో దాడి చేయించాడు. బిల్ కట్టడానికి ఇబ్బందిపెట్టడంతో కుక్కను వదిలాడు .అది ఊరుకుంటుందా పిక్క పీకేసింది. ఇక చేసేది లేక బాధితుడు మధురానగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు .


మధురానగర్ లో ఉండే నందివర్ధన్ రావు ఆర్బీఎల్ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నాడు. కార్డు పై రూ.2లక్షల వరకు అవుట్ స్టాండింగ్ ఉంది. ఆ బిల్ వసూలు చేసేందుకు బ్యాంక్ నుంచి రికవరీ ఏజెంట్ సత్యన్నారాయణ నందివర్దన్ రావు ఇంటికి వెళ్లాడు. అక్కడ అడిగితే ఇంట్లో లేడని చెప్పడంతో ఏజెంట్ కు కోపం వచ్చింది. గట్టి గా అరుస్తూ వెళ్తుండగా నందివర్ధనరావు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.


తాను క్రెడిట్ కార్డు డబ్బులు అడగడానికి వెళ్లగా కస్టమర్ నందివర్దన్ రావు కుక్కను ఉసిగొల్పాడని ఏజెంట్ సత్యనారాయణ చెప్తున్నాడు . కాని అతను తనపై అరుస్తూ మాట్లాడడం..పై పైకి రావడం చూసి తన కుక్క ఏజెంట్ పై అటాక్ చేసిందని నందివర్దన్ రావు చెబుతున్నాడు. ఏదైనా విషయం ముదిరి పోలీసు కేసు వరకకు వెళ్లింది. ఇప్పుడు వైరల్  అవుుతంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news bank-loan

Related Articles