wedding: వార్నీ సిబిల్ స్కోర్ కోసం పెళ్లి ఆపేశారా ..ఇదేం విచిత్రం !

మహారాష్ట్రలోని ముర్తిజాపూర్లో ఇరు కుటుంబాలు మ్యాట్రిమోని ద్వారా ఈ సంబంధం కుదుర్చుకున్నారు. పెళ్లి కూతురు మేనమామ మాత్రం అనూహ్యంగా రిక్వెస్ట్ చేశాడు.


Published Feb 08, 2025 07:41:00 PM
postImages/2025-02-08/1739023953_maharashtraweddingcalledoff202502d087fd6549473ac761824994307862b416x9.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  ఈ రోజుల్లో కుర్రాళ్లకు పెళ్లి పెద్ద టాస్కే. అమ్మాయిలు దొరకడం లేదు ..ఇదో రీజన్ అయితే ..వారికి మన జీతాలు నచ్చడం లేదు ...ఆస్తులు , కార్లు ఇలా సవాలక్ష కోరికలు కోరుతున్నారు. తాళి కట్టే వరకు పెళ్లి జరుగుతుందా లేదా డౌటే. అయితే రీసెంట్ ఓ కుర్రాడి కి షాక్ ఇచ్చింది అమ్మాయి . మామూలు షాక్ కాదు... పెళ్లి వరకు వచ్చి...పీటలు మీద కూర్చున్న తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కాదనుకొని వెళ్లిపోయింది. పెళ్లికొడుకు సిబిల్ స్కోరు బ్యాడ్ గా ఉండటంతో.. ఏకంగా వివాహాన్నే రద్దు చేసుకొని అంతా.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


మహారాష్ట్రలోని ముర్తిజాపూర్లో ఇరు కుటుంబాలు మ్యాట్రిమోని ద్వారా ఈ సంబంధం కుదుర్చుకున్నారు. పెళ్లి కూతురు మేనమామ మాత్రం అనూహ్యంగా రిక్వెస్ట్ చేశాడు. అతను వరుడి CIBIL స్కోర్ను తనిఖీ చేయాలనుకున్నాడు. అయితే చెక్ చెయ్యగా చాలా బ్యాంకుల్లో లోన్లు ఉన్నాయి. క్రెడిట్ స్కోర్ భయంకరంగా తక్కువగా ఉంది. దీనికి కారణం అడగగా .. చాలా సార్లు లోన్లు కట్టకపోవడం వల్ల ఇలా జరిగిందని . దీంతో వధువు కుటుంబం అతనితో పెళ్లిని వెంటనే రద్దు చేసుకుంది. కాగా ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వార్త విన్న వారు షాక్ అవుతున్నారు. పెళ్లి ఇలా కూడా క్యాన్సిల్ చేస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news wedding family

Related Articles