VIRAL: చికెన్ పకోడి కొనమని ఎలా చెప్తున్నాడో చూడండి.. బిజినెస్ ట్రిక్ మరి!

తెలివుంటే.. అడవిలో ఆకులు అమ్ముకొని అయినా బతకొచ్చంటారు పెద్దలు. సరిగ్గా ఇదే సామెత పాలో అయినట్టున్నాడో ఓ తెలివిగల బిజినెస్ మ్యాన్. తన క్యాటరింగ్ బిజినెస్ ని ప్రేమ, ఆప్యాయతలు, వరుసలు కలిపి మరీ ప్రమోట్ చేసుకుంటున్నాడు. క్యాటరింగ్,చికెన్ పకోడి, చికెన్ పచ్చడి అమ్ముకునేందుకు కస్టమర్లను బుట్టలో పడేసే ట్రిక్స్ ఫాలో అవుతున్నాడు.


Published Jul 18, 2024 01:31:29 AM
postImages/2024-07-18//1721283965_KodiPakodi.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: రండి బాబు రండి మాయా లేదు.. మోసం లేదు.. కనికట్టు అసలే కాదు. రండి మా వద్ద వేడి వేడి ...గరం గరం కోడి పకోడి అమ్మబడును.  అదేనండి చికెన్ పకోడి.. చికెన్ ఫ్రై అమ్మబడును ..ఏ ఊర్లో అమ్ముతున్నారు ఇంత స్పెషల్ కోడి.. పకోడి అని అడుగుతారేమో...వైరల్ అయ్యే వీడియోలను అడ్రస్ లు అడక్కూడదు. జస్ట్ చూసి ఆనందించండి.


షాపు పేరు మాత్రం తెలుసండోయ్ ...శ్రీ కనకదుర్గ క్యాటరింగ్ వాళ్లు ఓ వినూత్న తరహా లో తన చికెన్ పకోడిని ప్రమోట్ చేసుకున్నారు. ఓ బోర్డుపై ...చెల్లి బావకు చెప్పు ..అప్పారావు దగ్గర చికెన్ పకోడి తెమ్మని అంటూ కొటేషన్ వేశారు . చికెన్ పకోడి అనే వేసేస్తే సరిపోతుంది. కాని యజమాని క్రియేటివి చూడండి. వ్యాపారానికి కావాల్సిన కిటుకులు ఇవే.
మనం అమ్మాలనుకున్న వస్తువును ఎంత డిఫరెంట్ గా అమ్ముతామో.. అంత ఫేమస్ అవుతాం. బిజినెస్ కూడా అంత డెవలప్ అవుతుంది. ఈ క్యాటరింగ్ బిజినెస్ చేసే అప్పారావు కూడా అంతే. అందరినీ ఆకట్టుకునేలా బోర్డు పెట్టి వ్యాపారం డెవలప్ చేసుకుంటున్నాడు. ఈ బోర్డును ఊర్లో ప్రతి ఒక్కరు ఆగి చూసి.. టేస్ట్ చేసి మరీ వెళ్తున్నారట. సోషల్ మీడియోలో ఈ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 

చెల్లెమ్మ ..నువ్వు వండలేనిది. బావకి ఇష్టమైనది మా చికెన్ పచ్చడి..కొనమని చెప్పమ్మా అంటూ కొటేషన్..అమ్మాయి గారు అల్లుడి గారుకి చెప్పండి చికెన్ పచ్చడి తీసుకురమ్మని అడగండి. ఇలా డిఫరెంట్ గా తన బిజినెస్ ను ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో భలే వైరల్ అవుతుందనుకోండి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news chicken

Related Articles