అవేం మనుషులా...కష్టంలో ఉంటే అరడుగు పక్కకు జరిగిపోవడానికి దానికేం కష్టమో అని ..దాని సామాజిక వర్గం అంతా గాల్లో గోల చేస్తూ ...రౌండ్ ట్రిప్పులు వేస్తున్నాయి. ఇదేం గోల రా నాయనా ..ఒకదాని టార్చర్ భరించలేక తాడుతో కట్టేసి ..వీటన్నింటి గోల ఎలా భరించాలి మీరే చెప్పండంటు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చూడండి ...చాలా మంది పిల్లలు పేచీ పెడుతుంటే ఏంటి నీ కాకి గోల అంటారు ..చూశారా ..అదే ఇదే...ఓ చికెన్ షాపుకి రోజు ఓ కాకి వచ్చి పదే పదే అరుస్తుందట. ఒకటి రెండు సార్లు కాదు...గంటలు గంటలు అరుస్తుందట.. పాపం దానికేం కష్టమొచ్చిందో ..అరుస్తూనే ఉందట. ఇక ఈ కాకి గోల భరించలేక ..లటుక్కున పట్టేసి ..చటుక్కున పక్కనున్న కర్రకు కట్టేశాడట...చికెన్ షాపు ఓనర్. పాపం గోల తగ్గుతుందని అతని ఆశ.
అవేం మనుషులా...కష్టంలో ఉంటే అరడుగు పక్కకు జరిగిపోవడానికి దానికేం కష్టమో అని ..దాని సామాజిక వర్గం అంతా గాల్లో గోల చేస్తూ ...రౌండ్ ట్రిప్పులు వేస్తున్నాయి. ఇదేం గోల రా నాయనా ..ఒకదాని టార్చర్ భరించలేక తాడుతో కట్టేసి ..వీటన్నింటి గోల ఎలా భరించాలి మీరే చెప్పండంటు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.
కామెంట్లు చూసి నవ్వలేక చస్తున్నాం అనుకొండి. ఏంటి కాకి గోల తెలుసుకోవాలనుకున్నావా ఏంటి..అంటు కామెంట్లు పెడుతున్నారు. కాకి కి ఫ్రెండ్స్ ఎక్కువలా ఉన్నారంటు మరొకరు కామెంట్లు పెడుతున్నారు. కామెంట్లు పక్కన పెడితే ...కాకి గోల ...చూడాలి సామి ...చెవులు చిల్లులు పడేలా ...అరుస్తున్నాయనుకొండి. మనకి కాకులకు ఎంత తేడా...ఫ్రెండ్స్ అయితే ..కష్టం అనేసరికి పక్కకు తప్పుకుంటారు..కాకులు చూశారా ..వాటికి తోచిన సాయం చేస్తున్నాయి. అది మ్యాటర్ ..అనుకున్నట్లే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
కాకి అరిచి విసిగిస్తుందని తాడుతో కట్టేసిన ఓ చికెన్ షాప్ యజమాని
అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఒక కాకి అరిచి విసిగిస్తుందని దాన్ని ఓ చికెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశాడు.. అయితే కాకిని బంధించడంతో అక్కడకు వందలాది కాకులు చేరుకుని అరవడం మొదలెట్టాయి.
కాకుల గోలను… pic.twitter.com/08GzAC94px — Telugu Scribe (@TeluguScribe) July 17, 2024