Reels: రీల్స్ పేరుతో యువత పిచ్చి పనులు 2024-06-20 12:47:10

న్యూస్ లైన్ డెస్క్: రీల్స్(reels) పేరుతో యువత పిచ్చి పనులు చేస్తూ ప్రాణాలు తీసుకుంటోంది. రీల్స్ మోజులో పడి ఏం చేయాలో, ఏం చేయకూడదో కూడా విచక్షణ కోల్పోతోంది. రిస్క్ పనులు చేస్తూ ఇప్పటికే అనేక మంది ప్రాణాలు పొగొట్టుకున్నా కొంతమందిలో ఎలాంటి మార్పు రావడం లేదు. వరంగల్(warangal) జిల్లాలో ఓ యువకుడు రీల్స్ కోసం ప్రాణాలు బలితీసుకున్నాడు. అజయ్ అనే యువకుడు నర్సంపేటలోని తన చిన్న అక్క వాళ్ల ఇంట్లో రీల్స్ చేస్తు చనిపోయాడు. రీల్స్ కోసం ఉరి వేసుకునేది వీడియో తీసే క్రమంలో మెడకు తాడు బిగుసుకొని ప్రాణాలు వదిలివేశాడు. 
 
పూణె(pune)లోనూ ఓ యువ జంట ప్రాణాలకు తెగిస్తూ డేంజర్ స్టంట్స్(danger stunts) వేసింది. పూణెలోని జంబుల్‌వాడీ స్వామినారాయణ మందిర సమీపంలోని ఓ పాడుబడిన భవనంపై ఎక్కింది. అక్కడి నుంచి ఓ వ్యక్తి చేతి పట్టుకుంటే యువతి వేలాడుతూ డేంజర్ స్టంట్స్ చేసింది. అదృష్టం బాగుండి బయటపడింది. కానీ,  కాస్త చేయిజారినా ప్రాణాలు పోయేవి. ప్రస్తుతం ఈ వీడియో సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇది చుసిన వారంతా లైక్‌లు, ఫాలోవర్ల కోసం ప్రాణాలకు తెగిస్తూ ఇలా పిచ్చి పనులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.