VIRAL: ఇదేం అభిమానం రా నాయనా ..పెళ్లి కార్డుపై మహేష్ బాబు ఫొటో !


కర్నూలు జిల్లాకు చెందిన సాయి చరణ్ అనే వ్యక్తి మహేశ్ బాబుకు వీరాభిమాని . ఏం చేస్తే తన అభిమానాన్ని మహేష్ బాబు వరకు తీసుకువెళ్లగలడో ఆలోచించాడు.


Published Apr 26, 2025 11:03:00 PM
postImages/2025-04-26/1745688873_maheshbabu.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సినిమాలంటే ఇష్టం..హీరోలన్నా ఇష్టం కాని అభిమానం పేరుతో ఫ్యాన్స్ చేసే కొన్ని పనులు భలే వింతగా అనిపిస్తాయి. టాటూ చూశాం.. అచ్చు గుద్దినట్లు హీరోలా బట్టలు వేసుకునేవాళ్లను చూశాం కాని ఏకంగా తన పెళ్లిపత్రికలో అభిమాన హీరో ఫొటో ప్రింట్ చేసిన అభిమానిని మాత్రం ఇక్కడే చూస్తాం..వింటాం.ఆ మ‌ధ్య‌ రామ్ చరణ్ అభిమాని అయితే తన పంట పొలంలో చరణ్ ముఖం ఆకారంలో వరి పంట పండించి ఆ ధాన్యం మొత్తం కూడా రామ్ చ‌ర‌ణ్‌కి బ‌హుమ‌తిగా ఇచ్చాడు.


కర్నూలు జిల్లాకు చెందిన సాయి చరణ్ అనే వ్యక్తి మహేశ్ బాబుకు వీరాభిమాని . ఏం చేస్తే తన అభిమానాన్ని మహేష్ బాబు వరకు తీసుకువెళ్లగలడో ఆలోచించాడు. తన పెళ్లి కార్డుపై తన అభిమాన హీరో ఫొటో ప్రింట్ చేయించాడు. ఫ్యాన్స్ క్లబ్ లో చాలా చురుకుగా పనిచేస్తుంటాడు. తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మ‌హేష్ బాబు సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఫస్ట్ షెడ్యుల్ షూటింగ్ ఒరిస్సాల్ కంప్లీట్ కాగా, మే మొదటి వారం నుండి రెండవ షెడ్యూల్  ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో దాదాపు నెల రోజుల పాటు భారీ యాక్షన్ సీన్స్ ను రాజమౌళి షూట్ చెయ్యబోతున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రియాంకా చోప్రా , పృథ్వీ రాజ్ సుకుమారన్ , మహేష్ బాబు కూడా ఉండబోతున్నారని టాక్.
 

newsline-whatsapp-channel
Tags : viral-news wedding mahesh-babu fans

Related Articles