ganesha: వినాయకుడుకి రష్మిక గెటప్ ...మీ క్రియేటివిటీ తగలెయ్య !


గణేష్ చతుర్థి వచ్చిందంటే జనాలకు క్రియేటివిటీ పొంగి పొరలిపోతుంటుంది. గబ్బర్ సింగ్, బాహుబలి, జనతా గ్యారేజ్, పుష్ప, శ్రీమంతుడు  గెటప్ లతో వినాయకుడిని తయారుచేయిస్తారు


Published Sep 05, 2024 11:22:00 AM
postImages/2024-09-05/1725515597_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పుష్ప 2 మూవీ అల్లు అర్జున్ కి ఏ రేంజ్ హిట్టో మీకు తెలుసు కదా. ఏ పాట చూసినా హిట్టే అందులోను సూపే బంగారమాయనే...శ్రీవల్లి పాటకు అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఈ ఫ్యాన్స్ అంతా చేరి వినాయకుడికి శ్రీవల్లి గెటప్ వేశారు.


గణేష్ చతుర్థి వచ్చిందంటే జనాలకు క్రియేటివిటీ పొంగి పొరలిపోతుంటుంది. గబ్బర్ సింగ్, బాహుబలి, జనతా గ్యారేజ్, పుష్ప, శ్రీమంతుడు  గెటప్ లతో వినాయకుడిని తయారుచేయిస్తారు. ఇది తప్పని అందరికి తెలుసు కాని ఎవ్వరు మాట్లాడరు. వినాయకచవితి కొన్ని ప్రాంతాల్లో ఉత్సవం అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రెస్టేజ్ ఇష్యూ. పక్క వీధిలో కంటే మనం పెద్ద విగ్రహం పెట్టాలి. అలా చెయ్యాలి..ఇలా చెయ్యాలి. లక్షల్లో ఖర్చు చెయ్యాలి. డబ్బులు చందాలు అడగాలి.వినాయక చవితికి ప్రతి వీధిలో విగ్రహాలు వెలుస్తాయి. 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో గణేషుడిని పూజించి నిమ్మజ్జనం చేస్తారు. 


. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి జనాలు అవాక్కు అయ్యారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన హీరోయిన్ రష్మిక మందానను కూడా వినాయకుడు విగ్రహ రూపంలో చేయించారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. నెటిజన్ల అయితే క్రియేటివిటీకి అవాక్కయిపోతున్నారు. ఏం పైత్యం రా నాయనా ...దేవుడిని కూడా వదలరా అంటున్నారు నెటిజన్లు. మరికొంతమంది అయితే ఈ విగ్రహం చూసి దేవుడు కూడా ఆశ్చర్యపోతారంటున్నారు. పుష్ప 2 సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 షూటింగ్ పూర్తి కాని కారణంగా ఆలస్యమైంది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pushpa2 ganesh-chathurdhi rashmika-getup

Related Articles