వరల్డ్ టైటిల్ గెలుచుకునే క్రమంలో ఫైనల్లో ఆడిన చెస్ బోర్డును ప్రధానికి కానుకగా ఇచ్చాడు. దీనిపై ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: చెన్నై చెస్ ప్లేయర్ డి. గుకేశ్ రీసెంట్ గా వరల్డ్ చాంపియన్ షిప్ గెలుచుకోవడం అందరికి తెలిసిందే. సింగపూర్ లో జరిగిన వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ ఫైనల్స్ లో డింగ్ లిరెన్ అనే చైనా ఆటగాడిపై గెలిచాడు. 18 ఏళ్ల వయసుకే గుకేశ్ సాధించిన ఘనత భారత్ ను మరో మెట్టు పైకి ఎక్కించింది. అయితే గుకేశ్ ఈ రోజు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశాడు. తాను వరల్డ్ టైటిల్ గెలుచుకునే క్రమంలో ఫైనల్లో ఆడిన చెస్ బోర్డును ప్రధానికి కానుకగా ఇచ్చాడు. దీనిపై ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు.
"గుకేశ్ తో సంభాషణ అద్భుతంగా సాగింది. ఇవాళే కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు అతడితో మాట్లాడాను. తనలో నాకు నచ్చే విషయం చాలా స్ట్రాంగ్ గా ఆలోచిస్తారు. చాలా శాంతంగా ఉంటాడు. మరెంతో కాన్ఫిడెంట్ గా ఉంటాడంటూ ట్వీట్ చేశారు. కొన్నేళ్ల కిందటి ఓ వీడియోలో గుకేశ్ ఏం చెప్పాడో నాకు గుర్తుంది. తాను చిన్న వయసులోనే వరల్డ్ చాంపియన్ అవుతానని చెప్పాడు. అది నిజం కావడానికి తను ఎంత కష్టపడ్డాడో ఆలోచిస్తే చాలా ఆనందం గా ఉంది.
ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు, అతడిలో వినయం, సంయమనం కూడా చూడొచ్చు. ప్రపంచ విజేతగా నిలిచిన సమయంలోనూ అతడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు" అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు