Hema: హేమ డ్రగ్స్ తీసుకుంది.. "మా" నిర్ణయం మారుతుందా.?

నటి హేమ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమె తెలియని వారు ఉండరు.  అమ్మ, వదిన, అక్క క్యారెక్టర్లు చేసుకుంటూ ఎంతో గుర్తింపు పొందింది. అలాంటి హేమ కేవలం సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్


Published Sep 12, 2024 09:59:41 AM
postImages/2024-09-12/1726115381_hemadrugs.jpg

న్యూస్ లైన్ డెస్క్: నటి హేమ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమె తెలియని వారు ఉండరు.  అమ్మ, వదిన, అక్క క్యారెక్టర్లు చేసుకుంటూ ఎంతో గుర్తింపు పొందింది. అలాంటి హేమ కేవలం సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.  అయితే హేమ ఈ మధ్యకాలంలో బెంగళూరు శివారులో ఓ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి రేవు పార్టీలో పాల్గొని పోలీసులకు చిక్కింది. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారని సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు.

 దీంతో బెంగళూరు పోలీసులకు హేమ పట్టుబడింది. మొత్తం ఇందులో 88 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని  వారికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ తయారు చేశారు.  అంతేకాదు వారి షాంపిల్స్ కూడా తీసుకొని డ్రగ్స్ పరీక్షలకు పంపారు.  రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఎమ్ డి ఎమ్ఏ తెలియజేసింది. దీంతో హేమా యొక్క మెడికల్ రిపోర్ట్ లను కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. ప్రేమతో పాటు మరో 79 మంది నిందితుడిగా చేర్చారు. అలాగే మరో 9 మంది పార్టీ నిర్వహించిన వారిపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఎన్డిపిఎస్ సెక్షన్ 27 కింద హేమాను నిందితురాలిగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ తయారు చేయడంతో అది కాస్త వివాదంగా మారింది.  అయితే రేవ్ పార్టీలో దొరికిన సమయంలో హేమ నేను డ్రగ్స్ తీసుకోలేదని దానికి సంబంధించిన కొన్ని ఫేక్ ఆధారాలను తయారు చేసి  మా అసోసియేషన్ వారికి మరియు పోలీసువారికి అందించింది. దీంతో మా అసోసియేషన్ వారు సస్పెన్షన్ నిర్ణయాన్ని వాయిదా వేశారు.

అయితే తాజాగా బెంగళూరు పోలీసులు హేమా డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్ షీట్లో  పొందుపరచడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.  మరి మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు  హేమాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సస్పెన్షన్ ఎత్తివేసిన ఆయన, డ్రగ్స్ తీసుకుందని తేలడంతో సస్పెండ్ చేస్తారా లేదంటే సైలెంట్ గా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manchu-vishnu hema- bangalore-rave-party maa-association hema-take-drugs

Related Articles