covid: కరోనాతో క్యాన్స‌ర్ కు చెక్.. వైద్యరంగంలో సంచలనం !


కొన్ని లక్షల మంది ప్రాణం తీసేసిన కరోనా వైరస్ ఇప్పుడు క్యాన్స‌ర్ రోగుల‌కు వ‌రంలా మార‌నుంద‌నే శుభ‌వార్త‌ను వైద్య ప‌రిశోధ‌కులు అందించారు.


Published Nov 18, 2024 10:03:00 PM
postImages/2024-11-18/1731947664_VefaCGDyz7aU9XF864864C120080.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  కోవిడ్ -19 క్యాన్సర్ కణుతులపై దాడి చేసి క్యాన్సర్ ను తగ్గిస్తుందంటున్నారు వైద్య పరిశోధకులు. కోవిడ్ -19 వైరస్ క్యాన్సర్ కణాలపై దాడి చేయ‌గ‌ల‌ద‌నీ, అలాగే క్యాన్స‌ర్ క‌ణాల‌పై దాడి చేయ‌డానికి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించగలదని వైద్య‌ పరిశోధకులు కనుగొన్నారు. కరోనా వైరస్ కు రోగనిరోధక శక్తిని పెంచే ఓ విచిత్రమైన గుణముందంటున్నారు.


కొన్ని లక్షల మంది ప్రాణం తీసేసిన కరోనా వైరస్ ఇప్పుడు క్యాన్స‌ర్ రోగుల‌కు వ‌రంలా మార‌నుంద‌నే శుభ‌వార్త‌ను వైద్య ప‌రిశోధ‌కులు అందించారు. ఈ అధ్యయనాన్ని నార్త్‌వెస్ట్రన్ మెడిసిన్ క్యానింగ్ థొరాసిక్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనలో గుర్తించారు. ఇది కొత్త క్యాన్సర్ చికిత్సల అభివృద్ధికి ఊతం ఇచ్చే అవకాశాలున్నాయి. కొంతమంది వైద్యులు కోవిడ్ -19 తో పాటు క్యాన్సర్‌తో బాధపడుతున్న కొంతమందిని ప‌రిశీలించారు. అయితే ఈ పరిశోధన ప్రాధమిక స్థాయిని మాత్రమే దాటింది. క్యాన్సర్ చికిత్స కు ఈ కోవిడ్ సహాయపడుతుందా. ఏ స్థాయిలో పడుతుందనేది ఆలోచించాల్సిన విషయమే. 


క్యాన్సర్ కణాలు కొన్నిసార్లు మోనోసైట్‌లను ట్రిక్ చేస్తాయ‌నీ, వాటిని ఉపయోగించి రోగనిరోధక వ్యవస్థ దాడి నుండి కణితిని దాచిపెట్టే రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి. అయితే, SARS-CoV-2 స‌మ‌యంలో ఈ రక్షిత ప్రభావం మారుతుంది, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్‌ను మరింత ప్రభావవంతంగా గుర్తించి, పోరాడేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. అయితే మరో రెండేళ్లలో పూర్తి స్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ ను ప్రభావితం చేసేటట్లు చర్యలు మాత్రం జరుగుతాయంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-benifits cancer covid-time

Related Articles