AQI: ఢిల్లీలో ఒక రోజు ఉంటే 49 సిగరెట్లు కాల్చినట్టే ?

ఏక్యూఐ స్థాయిలు ఏకంగా 978 కి చేరాయంటూ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రీసెంట్ గా మరో విషయం బయటపెట్టారు


Published Nov 18, 2024 09:46:00 PM
postImages/2024-11-18/1731946684_INDIAENVIRONMENTPOLLUTION417299009819851729901005087.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఢిల్లీలో పొల్యూషన్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే స్కూల్స్ మూసేసి ...ఆన్ లైన్ క్లాసులు నడిపిస్తున్నారు. ఏక్యూఐ స్థాయిలు ఏకంగా 978 కి చేరాయంటూ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రీసెంట్ గా మరో విషయం బయటపెట్టారు. ఒక్క రోజు కాని ఢిల్లీ లో ఉంటే ఏకంగా 49 సిగరెట్లు కాల్చినంత దారుణంగా పరిస్థితి ఉన్నట్లు తెలిపారు.


గాలిలోని దుమ్ము, ధూళి (పీఎం 2.5, పీఎం 10) కలుషితాలు, విషపూరిత వాయువుల శాతాన్ని పరిశీలించి... గాలి నాణ్యతను నిర్ధారిస్తారు. దీనిని ‘ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్)’గా పేర్కొంటారు. ఇది ఎంత  ఎక్కువగా ఉంటే... గాలి నాణ్యత అంత దారుణంగా ఉంటుందన్న మాట. 


ఈ రోజు ఉదయం ఢిల్లీలో 978 ఏక్యూఐ నమోదైంది. ఇది ఎంత కాలుష్యం అంటే.. అక్కడి గాలిని 24 గంటల పాటు పీలిస్తే, 49 సిగరెట్లు తాగిన దానితో సమానం. ఇది అసలు మంచి పరిణామం కాదని చెబుతున్నారు.
హర్యానా 631 ఏక్యూఐతో రెండో స్థానంలో ఉంది. పంజాబ్ లో కూడా ఇదే పరిస్థితి


బీహార్ (రోజుకు 10 సిగరెట్లు తాగినంత), ఉత్తర ప్రదేశ్ (9.5), ఒడిశా (7.5), బెంగాల్ (7.5), రాజస్థాన్ (7.5), పంజాబ్ (6.5), మధ్యప్రదేశ్ (5.5) తదితర రాష్ట్రాలు ఉన్నాయి. అయితే జమ్ము, కాశ్మీర్ , లఢక్ , లక్షద్వీప్ , అండమాన్ నికోబార్ లో మాత్రం గాలి ప్యూరిటీ చాలా బాగున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఏపీలలో గాలి కాలుష్యం రోజుకు రెండు సిగరెట్లు తాగినదానితో సమానం. అయితే ఎయిర్ పొల్యూషన్ కు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చాలా కష్టమంటున్నారు నిపుణులు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pollution delhi smoking

Related Articles