రుచికి ఫేమస్ గా ఉండే భాగ్యనగరం ఇప్పుడు అత్యంత విషపూరిత ఆహారాన్ని అందిస్తున్నారని తెలిపారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హైదరాబాద్ అనగానే బిర్యానీ ...షవర్మా...పాయా..మటన్ కూర్మా ఇలా చాలా పెద్ద లిస్ట్ చెప్తాం. కాని ఫుడ్ సేప్టీ లో హైదరాబాదే లీస్ట్ లో ఉందంటున్నాయి సర్వేలు. దాదాపు 85 శాతం హోటల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ జరగడం ..అధికారులు కనిపెట్టారు. రుచికి ఫేమస్ గా ఉండే భాగ్యనగరం ఇప్పుడు అత్యంత విషపూరిత ఆహారాన్ని అందిస్తున్నారని తెలిపారు.
కొన్ని హోటళ్లలో ఫుడ్ పాయిజనింగ్ జరగడం, అధికారుల తనిఖీల్లో కుళ్లిన చికెన్, పాడైపోయిన ఆహార పదార్థాలు బయటపడడం వంటి ఘటనలే అందుకు కారణం. కొన్ని చోట్ల బిర్యానీల్లో బొద్దింకలు, ఇతర జీవులు కూడా దర్శనమిచ్చాయి. చిన్న చిన్న రెస్టారెంట్లలోనే కాదు...పెద్ద పెద్ద పేరుమోసిన రెస్టారెంట్స్ లో కూడా ఫుడ్ సేఫ్టీ ఉండడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో జాతీయస్థాయిలో చేపట్టిన ఓ సర్వేలో హైదరాబాద్ చివరిస్థానంలో నిలిచింది. కల్తీ ఆహారానికి సంబంధించి భారత్ లోని 19 మేజర్ సిటీల్లో క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే చేపట్టింది. ఈ సర్వేలో హైదరాబాద్ కు లాస్ట్ స్థానం దక్కింది.హైదరాబాదులోని 62 శాతం హోటళ్లలో గడువు తీరిన ఆహార పదార్ధాలు వినియోగిస్తున్నారట. కాబట్టి తినేటపుడు కాస్త ఆలోచించి ఆరోగ్యం మీద శ్రధ్ధతో ఉండండి.