ఒకే రోజు ఒకే కళ్యాణమండపాన్ని 17 మందికి రెంట్ కి ఇచ్చింది. పాపం ఈవిడ వల్ల దాదాపు 17 మంది పెళ్లి ఆగిపోయింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎక్కడున్నా ...పేరు చెడగొడతారు కొందరు. దేశం కాని దేశంలో మనం చేసే ప్రతి తప్పు ...మన దేశానికి చెడ్డపేరు అని కూడా గుర్తుండదు. దక్షిణాఫ్రికా లో ఓ మాయ లేడీ ఘరానా మోసం చేసింది. ఒకే రోజు ఒకే కళ్యాణమండపాన్ని 17 మందికి రెంట్ కి ఇచ్చింది. పాపం ఈవిడ వల్ల దాదాపు 17 మంది పెళ్లి ఆగిపోయింది.
అసలు ఏం జరిగిందంటే ...ప్రిలిన్ మోహన్‌లాల్ అనే భారత సంతతి మహిళ దక్షిణాఫ్రికాలో ఈ ఘరానా మోసాలకు పాల్పడినట్టు తేలింది. ఆమెకు ఏమాత్రం సంబంధం లేని ఒక ఫంక్షన్ హాల్ పేరు చెప్పి ఈ మోసాలకు పాల్పడినట్టు నిర్ధారణ అయింది. తన పెళ్లి ఆగిపోయినందుకు కోపంతో ..ఓ మహిళ గతేడాది డిసెంబర్‌లో ప్రైవేటు భద్రతా సంస్థ ‘రియాక్షన్ యూనిట్ సౌతాఫ్రికా’ను ఆశ్రయించింది. వీరు ఆ మహిళ బండారాన్ని బయటపెట్టింది.
అయితే ఈవిడ లాయర్ . ఓ క్లయింట్‌కు చెందిన ట్రస్ట్ ఫండ్ అకౌంట్ నుంచి డబ్బు దొంగిలించడంతో లా సొసైటీ ఆమెను నిషేధించింది. 20 ఏళ్లకు పైగా స్కామ్‌ల చరిత్ర ఉందని తెలిపారు పోలీసులు . అయితే పెళ్లి జంటలకు తను తీసుకున్న డబ్బు వెనక్కి ఇస్తానని చెప్పినా వారు పోలీసులను ఆశ్రయించారని తెలిపింది.