జగన్మాత మా అత్త ను చంపేయమని ఓ కోడలో..అల్లుడో దేవతకు ఉత్తరం రాశారు. అది కూడా 20 రూపాయిల నోటు మీద రాసి హుండీ లో వేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కొత్తగా మొక్కుకునే వారు, మొక్కు చెల్లించుకునే వారు ఆలయాల్లోని హుండీల్లో కానుకలు వేయడం తెలిసిందే . అసలు కోరిక లేని భక్తులే లేరు. నచ్చిన కోరికలు దేవుడికి సమర్పిస్తుంటారని చాలా మందికి తెలుసు కదా..అయితే ఇంటింటి రామాయణం లాగా అత్తకోడళ్లో, అత్తా అల్లుడో మరి ..ఇంటి పంచాయితీ ఇఫ్పుడు అమ్మోరు గుడికి చేరింది. ఎన్ని కష్టాలుపెట్టిందో తెలీదు కాని తల్లి ...జగన్మాత మా అత్త ను చంపేయమని ఓ కోడలో..అల్లుడో దేవతకు ఉత్తరం రాశారు. అది కూడా 20 రూపాయిల నోటు మీద రాసి హుండీ లో వేసింది.
కర్ణాటకలోని కలబుర్గి పట్టణంలో ఉన్న భాగ్యమతి అమ్మవారి ఆలయంలోని హుండీలో ఓ కరెన్సీ నోటుపై రాసి ఉన్న అక్షరాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. కన్నడలో ఇలా రాసి ఉంది..అమ్మా... మా అత్తను త్వరగా చంపు తల్లీ అంటూ ఓ రూ.20 నోటుపై రాసి హుండీలో వేశారు. పరకామణిలో హుండీ సొమ్మును లెక్కిస్తుండగా ఈ నోటు కంటబడింది. వింత గా అనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సదరు వ్యక్తి. ఇఫ్పుడు ఫుల్ వైరల్ అవుతుంది.