ఇండియాలోనే పెద్ద పేరుగాంచినటువంటి గాయకుల్లో సుశీల కూడా ఒకరు. పద్మభూషణ్ గ్రహీత అయినటువంటి సుశీల పాటలతో ఎంతోమంది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేది. కేవలం తెలుగులోనే
న్యూస్ లైన్ డెస్క్: ఇండియాలోనే పెద్ద పేరుగాంచినటువంటి గాయకుల్లో సుశీల కూడా ఒకరు. పద్మభూషణ్ గ్రహీత అయినటువంటి సుశీల పాటలతో ఎంతోమంది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ, ఇలా మొత్తం తొమ్మిది భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి చరిత్ర సృష్టించారు సుశీల. ఈమె సరోజా దేవి, సావిత్రి, పద్మిని, వంటి నటీనటులకు కూడా పాటలు పాడారు. సుశీల పాట పాడింది అంటే రాళ్లయినా కరగాల్సిందే. అద్భుత గొంతుతో గానాన్ని ఆలపిస్తూ ఉంటుంది.
అలాంటి సుశీల ప్రస్తుతం వృద్ధాప్య దశలో ఉంది. అయితే శనివారం ఆమెకు కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రజెంట్ సుశీల చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. వైద్య పరీక్షలు చేసినటువంటి డాక్టర్లు ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలియజేశారు.
అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కోరుకుంటూందని ఆరోగ్యంగానే ఉందని కుటుంబ సభ్యులు మీడియాతో చెప్పారు. ఉమ్రేష్ మన్మాన్ మూవీలోని 'లైక్ పాల్' అనే సాంగ్ మొదటిసారిగా ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా అవార్డు పొందింది.