Dabbawala: ముంబై లోనే కాదు..లండన్ లోను డబ్బావాలా !

ముంబై డబ్బావాలా కల్చర్ మనకు తెలిసిందేగా...గంటల గంటల ట్రాఫిక్ లో కూడా టైంకి భోజనం అందిస్తారు. అలా అని ఇదేదో చిన్న ఉద్యోగం అనుకోవడానికి లేదు..పెద్ద బెటాలియన్ ఉంటుంది . వీళ్లంతా ఓ పెద్ద సంఘం . తేడా కొడితే తోలు తీసేస్తారు. అయితే ఈ డబ్బావాలా కాన్సప్ట్ ను ఇప్పుడు లండన్ లో ఫాలో అవుతున్నారు. అవ్వడమే కాదు  విజయవంతంగా సేవలు అందిస్తున్నారు .


Published Jul 18, 2024 11:49:00 AM
postImages/2024-07-18/1721283707_4dd35a1b23574820a54d3e660d682db1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ముంబై డబ్బావాలా కల్చర్ మనకు తెలిసిందేగా...గంటల గంటల ట్రాఫిక్ లో కూడా టైంకి భోజనం అందిస్తారు. అలా అని ఇదేదో చిన్న ఉద్యోగం అనుకోవడానికి లేదు..పెద్ద బెటాలియన్ ఉంటుంది . వీళ్లంతా ఓ పెద్ద సంఘం . తేడా కొడితే తోలు తీసేస్తారు. అయితే ఈ డబ్బావాలా కాన్సప్ట్ ను ఇప్పుడు లండన్ లో ఫాలో అవుతున్నారు. అవ్వడమే కాదు  విజయవంతంగా సేవలు అందిస్తున్నారు .


కంపెనీ పేరును కూడా డబ్బావాలాను గుర్తుచేసేలా ‘డబ్బాడ్రాప్’ అంటూ పెట్టారు. అలా అని ఇది నిన్న మొన్న స్టార్ట్ అయినది కాదు. గత ఆరేళ్లుగా చేస్తున్నారు.  ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణే లక్ష్యంగా డబ్బాడ్రాప్ కంపెనీని స్థాపించారట.  ఆరేళ్లు కంప్లీట్ అయిన సంధర్భంగా ఓ వీడియో పోస్ట్ చేసింది కంపెనీ. కస్టమర్లకు అందించే సేవల గురించి కంపెనీ చక్కగా ఓ వీడియో తీసి పోస్ట్ చేసింది.


స్టీల్ టిఫిన్ క్యారేజీలో ఓ డబ్బాలో అన్నం, మరో డబ్బాలో పన్నీర్ కర్రీ, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీని సంస్థ సిబ్బంది నీట్ గా ప్యాక్ చేశారు. ఆపై డబ్బాను ఓ రుమాలుతో కట్టిస్తారు. డబ్బాడ్రాప్ సిబ్బంది వీటిని ఎలక్ట్రిక్ సైకిల్ తో వాటి చిరునామాలకు చేరుస్తాడు. గడిచిన ఆరేళ్లలో లండన్ లో 3.75 లక్షల ప్లాస్టిక్ కంటెయినర్ల వాడకాన్ని తప్పించినట్లు డబ్బాడ్రాప్ పేర్కొంది. ఈ కాన్సప్ట్ చాలా బాగుందని ...దేశమంతా వ్యాపించాలని అనుకుంటున్నారట.

 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu viral-news

Related Articles