Loneliness:ఒంటరితనం ఓ మానసిక రోగం.!

ప్రస్తుత కాలంలో చాలామంది ఒంటరితనం అనే మానసిక రోగంతో బాధపడుతున్నారు. ఎంత డబ్బు సంపాదించినా, ఎంతోమంది బందు గణాలు ఉన్న కానీ, ఒంటరితనం అనే ఫీలింగ్ లోకి వెళ్లి చివరికి ఆ*హత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నారు.ఈ ఒంటరితనం ఫీలింగ్ ఎందుకు వస్తోంది. దీనికి కారణాలేంటి అనే వివరాలు చూద్దాం. అయితే రానున్న రోజుల్లో ఈ ఒంటరితనాన్ని మానసిక రోగుల చిట్టాలో  చేర్చే అవకాశం కూడా కనిపిస్తోంది.  అయితే ఈ ఒంటరితనం అనే రోగం ఎక్కువ జన సాంద్రత తక్కువగా ఉండే దేశాల్లో కనిపిస్తుందట.


Published Jul 23, 2024 11:10:00 AM
postImages/2024-07-23/1721711030_lonli.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది ఒంటరితనం అనే మానసిక రోగంతో బాధపడుతున్నారు. ఎంత డబ్బు సంపాదించినా, ఎంతోమంది బందు గణాలు ఉన్న కానీ, ఒంటరితనం అనే ఫీలింగ్ లోకి వెళ్లి చివరికి ఆ*హత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నారు.ఈ ఒంటరితనం ఫీలింగ్ ఎందుకు వస్తోంది. దీనికి కారణాలేంటి అనే వివరాలు చూద్దాం. అయితే రానున్న రోజుల్లో ఈ ఒంటరితనాన్ని మానసిక రోగుల చిట్టాలో  చేర్చే అవకాశం కూడా కనిపిస్తోంది.  అయితే ఈ ఒంటరితనం అనే రోగం ఎక్కువ జన సాంద్రత తక్కువగా ఉండే దేశాల్లో కనిపిస్తుందట.

దీని బారిన పడ్డ చాలా మంది ప్రజలు ఆందోళన క్రుంగుబాటుకు గురికావడం చివరికి ఆత్మహత్యకు కూడా ప్రేరేపించుకోవడం జరుగుతుందట.  ఈ ప్రభావం మెల్లిమెల్లిగా మన దేశ ప్రజలపై కూడా పడుతోంది.  దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం దేశంలో మారినటువంటి జీవన విధానాలు  అని చెప్పవచ్చు. చాలామంది పెద్దపెద్ద నగరాలకు వలస వెళ్లి అక్కడ జాబులు చేయడం  వంటివి చేస్తున్నారు.  ముఖ్యంగా పెళ్లికాని యువత నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడం మిగతా సమయంలో ట్రాఫిక్ లో గడపడం ఈ కాస్త దొరికిన విరామ సమయాన్ని ఫోన్ లోనో, లేదంటే టీవీలలో ఏదో ఒక విధంగా గడపడం చేస్తున్నారు.

కనీసం పక్కనుండే ఫ్రెండ్ తో కూడా మాట్లాడే పరిస్థితులు లేకుండా చేసుకుంటున్నారు.  రూమ్ లో నలుగురు  ఫ్రెండ్స్ ఉంటే కాస్త టైం దొరికితే, ఎవరి ఫోన్ వారు పట్టుకొని చూడడం తప్ప ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు.  ఇక ఈ ఒంటరితనం వల్ల కొంతమంది మద్యం, జూదానికి కూడా అలవాటు పడుతున్నారట. ఎక్కువ పట్టణాల్లో జీవించే వ్యక్తుల్లో చాలామందికి సొంత ఊర్ల నుంచి అక్కడికి జాబ్ ల కోసం వచ్చిన వారే.

మీరు చిన్నతనం నుంచి ఓ ఏజ్ వచ్చేవరకు అక్కడ పెద్ద కుటుంబాలలో మరియు స్నేహితులతో కలిసి ఉండేవారు.  ఒక్కసారిగా పట్టణాలకు వచ్చి జాబులు చేయడం,  ఆఫీస్ ల్లో ఒత్తిడి, పని అయిపోగానే ట్రాఫిక్ లో ఇరుక్కోవడం అక్కడ గంటలు గంటలు వెయిట్ చేయడం,  చివరికి రూముకు వచ్చిన తర్వాత  ఉన్న కొద్ది సమయాన్ని ఫోన్ లో గడపడం  వంటివి చేస్తున్నారు. దీని వల్ల కూడా చాలామంది ఒంటరితనం అనే ఫీలింగ్ లోకి వెళ్లి ఈ జన్మ ఏంట్రా అనే ఆలోచనకు వచ్చి చివరికి ఆత్మ*హ*త్యకు కూడా పాల్పడుతున్నారట.

మరి కొంతమంది తోడు కోసం ఎదురుచూసి సరైన భాగస్వామి దొరకక ఇబ్బందులు పడడం, అలాగే ఏదైనా ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు చేసుకొని అన్ని మన కళ్ళ ముందుకే తెప్పించుకోవడం వల్ల కనీసం బయటకు వెళ్లే పరిస్థితులు కూడా ఉండడం లేదు. ఈ విధమైనటువంటి కారణాల దృష్ట్యా ఒంటరితనం అనేది దారుణంగా పెరిగిపోతుంది. ఇది ఇలాగే పెరుగుకుంటూ పోతే మాత్రం రాబోవు రోజుల్లో గుండెపోట్లు, పక్షవాతం, ఆటో ఇమ్యూన్  సమస్యలు, మధుమేహం, స్థూలకాయం వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందట. ఒంటరితనాన్ని దూరం చేసేందుకు కొన్ని దేశాలలో  సామాజిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, యూత్ ఫెస్టివల్స్ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu youth loneliness mental-illness.

Related Articles