Elephant:లవ్ స్టోరీ..ప్రేయసి కోసం గర్జించిన గజరాజు.. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరు చదవాల్సిందే?

సాధారణంగా లవ్ స్టోరీలు అంటే ఎక్కువగా  మానవులకే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన లవ్ స్టోరీ ఉంటుంది. ఈ విధంగానే జంతువులకు కూడా లవ్ స్టోరీ ఉంటుందని ఏనుగు నిరూపించింది. ఏనుగు తన


Published Aug 30, 2024 08:56:39 AM
postImages/2024-08-30/1724988399_elephant.jpg

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా లవ్ స్టోరీలు అంటే ఎక్కువగా  మానవులకే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన లవ్ స్టోరీ ఉంటుంది. ఈ విధంగానే జంతువులకు కూడా లవ్ స్టోరీ ఉంటుందని ఏనుగు నిరూపించింది. ఏనుగు తన ప్రేయసి కోసం చేసినటువంటి పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా ఏనుగులు వాళ్ల యొక్క భాగస్వామిని ఎంతో లవ్ చేస్తాయట. అవి దూరం అయితే మాత్రం వాటి ప్రవర్తనలో తీవ్రమైన మార్పు వస్తుందట. తాజాగా ఈ ఏనుగు కూడా తన భాగస్వామికి దూరం అవ్వడంతో దారుణంగా ప్రవర్తించిందట. ఆ టైంలో దాన్ని ఆపే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయలేదట.  ఇంతకీ ఆ ఏనుగు భాగస్వామి ఏమైందో ఇప్పుడు చూద్దాం..

దూద్వా టైగర్ రిజర్వు  ఫారెస్ట్ ఉత్తరప్రదేశ్ లోని లక్కీంపూర్ ప్రాంతంలో ఉన్నది. ఇది ఏనుగులకే కాకుండా పులులకు ప్రసిద్ధిగాంచిన అరణ్యం. అయితే ఈ అడవిలో ఒక ఏనుగు భయంకరమైన విరహ వేదనను అనుభవిస్తున్నది. దీనికి కారణం తాను ప్రేమించినటువంటి భాగస్వామి ఏనుగు చనిపోవడమే. ఇంతకీ ఈ ఏనుగు పేరు ఏంటయ్యా అంటే గజరాజు. దీని వయస్సు ఏడు సంవత్సరాలు. ఈ ఏనుగుతో పాటు మరో ఐదు ఏనుగులు అటవీశాఖ అధికారుల సంరక్షణలో పెరుగుతున్నాయి.  తాజాగా వీటిని అడవిలో మేత కోసం తీసుకెళ్లారు. అప్పటివరకు ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి గజరాజు ఒక్కసారిగా కోపానికి వచ్చింది.  మదమెక్కినట్లు ప్రవర్తించింది. దీనికి ప్రధాన కారణం తన ప్రేయసి ఏనుగు కనిపించకపోవడమే.

గత కొంతకాలంగా ఆ ఏనుగు కనిపించకపోవడంతో ఈ ఏనుగు డల్ గా ఉందట. దాని ఊహల్లోనే బతుకుతూ తన శక్తిని అంతా కూడగట్టి ఎదురుగా ఉన్నటువంటి ఇనుపకంచెను కూడా బద్దలు కొట్టి అడవిలోకి పారిపోయిందట. కానీ ఎంత వెతికిన తన ప్రేయసి ఏనుగు కనిపించలేదట. అయితే ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు. అయితే ఈ ఏనుగు సంతానోత్పత్తి సమయం అని తెలియజేస్తున్నారు.  మగ ఏనుగులకు హార్మోన్ల మార్పు వల్ల ఇలా ప్రవర్తిస్తాయని, ఆ సమయంలో వారికి నచ్చినటువంటి ఆడ ఏనుగులు దగ్గర లేకుంటే ఇష్టం వచ్చినట్లు కోపానికి వస్తాయని, ఆ టైంలో వాటిని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదని అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu love-story uttarpradesh dudwa-forest elephant-love-story

Related Articles