Mother Milk:తల్లికి పాలు పెరగాలంటే ఈ ఫుడ్ తినాల్సిందే.?

ప్రస్తుత కాలంలో చాలామంది  ఆడపిల్లలకు పెళ్లి ప్రెగ్నెంట్ అయిన తర్వాత కనీసం పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా వారి దగ్గర పాలు రావడం లేదు. దీంతో ఆ చిన్నారులు డబ్బా పాలకే పరిమితం కావలసి


Published Aug 24, 2024 07:57:00 AM
postImages/2024-08-24/1724466420_mother.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది  ఆడపిల్లలకు పెళ్లి ప్రెగ్నెంట్ అయిన తర్వాత కనీసం పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా వారి దగ్గర పాలు రావడం లేదు. దీంతో ఆ చిన్నారులు డబ్బా పాలకే పరిమితం కావలసి వస్తోంది. దీనికి ప్రధాన కారణం వారు పెరిగిన వాతావరణం, తినే ఫుడ్ వల్లే అని చెబుతున్నారు. మరి అలా తల్లులకు  తొందరగా పాలు పెరగాలంటే  కొన్ని ఫుడ్స్ తప్పనిసరిగా తినాలని డాక్టర్లు అంటున్నారు. ఆహార పదార్థాలు ఏంటి వివరాలు చూద్దాం..

#1. ఆకు కూర:
 మన మార్కెట్ లో ఎక్కువగా దొరికే  తోటకూర, పాలకూర, కాలే, గ్రీన్స్, వంటివి తింటే ఇందులో ఉండే ఐరన్, కాల్షియం  వల్ల తల్లికి పాలు సమృద్ధిగా వస్తాయట. 

#2. ఓట్ మీల్ :
 ఈ ఫుడ్ లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల తల్లిపాలను సమృద్ధిగా తెప్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇవి తినడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందట. 

#3. నట్స్:
 బాదం, వాల్ నట్స్, పిస్తా  వంటి వాటిలో మంచి కొవ్వులు ఉంటాయట. వీటిని తినడం వల్ల తల్లి పాలు పెరుగుతాయట. 

#4. ఫ్యాటీ ఫిష్:
సార్డ్నేష్, ట్యూనా , సాల్మన్, మాకేరన్, వంటి ఫ్యాటీ చేపల్లో ఒమేగా 3ప్యాటి యాసిడ్స్  ఎక్కువగా ఉండటం వల్ల, తల్లిపాలు సమృద్ధిగా వస్తాయట. 

#5. తులసి:
 తులసి సోంపు వంటివి ఎక్కువగా తినడం వల్ల కూడా తల్లికి పాలు సమృద్ధిగా వస్తాయట. 

#6. తృణధాన్యాలు:

క్వినోవా, బ్రౌన్ రైస్  వంటివి ఎక్కువగా తినడం వల్ల ఇందులో ఉండే కాంప్లెక్స్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ బి, ఫైబర్ కంటెంట్ పుష్పలంగా ఉంటుందట. దీనివల్ల తల్లి పాలు సమృద్ధిగా పెరుగుతాయని అంటున్నారు. 

#7. పాలు
 పాలు పాల నుంచి తయారైన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల  ఇందులో ఉండే లాక్టోజెనిక్ హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. దీనివల్ల పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందట.

newsline-whatsapp-channel
Tags : news-line child health milk-products food, mother

Related Articles