Myanmar: ఉద్యోగుల జీతాలు పెంచినందుకు ఓనర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

Published 2024-07-04 19:35:53

postImages/2024-07-04/1720101953_030724mynmar.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎవరెన్ని చేసినా ఆ కడుపు నిండడానికే...జనాలంతా చేసే సర్కస్ లన్నీ ... బతకడం , తినడం, లగ్జరీ , ఇళ్లు కట్టుకోవడం ..ఎవరి స్థోమతను బట్టి వారు చేస్తుంటారు. కాని ఎవరు పని చేసినా ...జీతం పెరగాలి..బాగా బతకాలి ఇదే అల్టిమేట్ గోల్. కాని జీతాలు పెంచరు...ఏ సంస్థ అయినా ..జీతాలు పెంచాలంటే సవాలక్ష ఉంటాయి. కాని నిజంగా జీతాలు పెంచితే మాత్రం ఆ ఓనర్ దేవుడే . కాని జీతాలు పెంచినందుకు పోలీసులు అరెస్ట్ చేశారంటే మాత్రం ఆశ్చరపోవాల్సిందే.


షాపులో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచారు మయన్మార్ కు చెందిన ఓ యజమాని. జీతాలు పెంచిన కారణంగా పోలీసులు అరెస్టు చేశారు.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పని చేశారంటూ పది మంది షాపు ఓనర్లను మిలటరీ కోర్టు ముందు నిలబెట్టారు. ఈ వింత ఘటన ఇపపుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. గతంలో బర్మాగా వ్యవహరించిన మయన్మార్ దేశంలో ప్రస్తుతం మిలటరీ పాలన కొనసాగుతోంది.


మయన్మార్ లో ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో సైనిక పాలనపై ప్రజల్లో తిరుగుబాటు రేగే అవకాశం ఉందని మిలటరీ భయపడుతోందని, ఎక్కడికక్కడ కఠినంగా వ్యవహరిస్తోందని అక్కడి లాయర్లు చెబుతున్నారు. ఇలాంటి టైంలో షాపులో పనిచేసేవారి జీతాలు పెంచారు . ఇలా ఉద్యోగుల జీతాలు పెంచడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరగనుందని ప్రజలు ఆందోళన చెందుతారని మిలటరీ పాలకులు భావించారని తెలిపారు. ఈ మిలటరీ చేసిన పనికి ...జీతాలు పెరిగాయని ఆనందించే లోపే...ఉద్యోగాలే పోయాయి ..ఇది నిజంగా బాధాకరం అంటున్నారు అక్కడి లాయర్లు.